కొన్ని గంటలు పాటూ ఆహారం తినకపోతేనే విపరీతంగా ఆకలి వేస్తుంది. అయితే ఎప్పుడైనా ఆలోచించారా? ఒక వ్యక్తి ఆహారం లేకుండా ఎన్ని రోజులు బతకగలడు అని. వైద్యులు ఏం చెప్పారో తెలుసుకోండి.
మనం ప్రతిరోజూ మూడు పూటలా ఆహారం తింటాడు. ఒక్క పూట భోజనం ఆలస్యమైతేనే నీరసంగా అనిపిస్తుంది. కొందరు వ్యక్తులు ఉపవాసాలు ఉంటారు. అయితే ఎప్పుడైనా ఆలోచించారా? ఆహారం లభించని పరిస్థితులు వస్తే ఎన్ని రోజులు ఒక వ్యక్తి బతకగలడు? ఆ సమయంలో మానవ శరీరంలోని అవయవాలు శక్తిని ఎలా ఉత్పత్తి చేసుకుంటాయి? ఈ ప్రశ్నలకు వైద్యులు ఆసక్తికరమైన శాస్త్రీయ సమాధానాలను వెల్లడించారు. మానవ శరీరం ఒక అద్భుతమైన యంత్రంలా పనిచేస్తుంది. ఆహారం అందనప్పుడు అది ప్రత్యేక ఎమర్జెన్సీ మోడ్లోకి వెళ్లి శరీరానికి శక్తి ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది.
23
శక్తిని ఇలా అందిస్తుంది
ఆహారం అందడం ఆగిపోయిన మొదటి కొన్ని గంటల నుంచి కొద్ది రోజుల వరకు శరీరం శక్తిని పొందే ప్రక్రియ మొదలవుతుంది. సాధారణ రోజుల్లో మనం తినే ఆహారం ద్వారా లభించే 'గ్లూకోజ్' మనకు తక్షణ శక్తిని ఇస్తుంది. అయితే ఆహారం తీసుకోవడం ఆపేసిన మొదటి 12 నుంచి 24 గంటల్లో, కాలేయం, కండరాలలో ముందుగానే దాచిపెట్టిన 'గ్లైకోజెన్' నిల్వలను శరీరం విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తుంది. ఈ గ్లైకోజెన్‌ను గ్లూకోజ్‌గా మార్చి మెదడుకు, ఇతర అవయవాలకు శక్తిని సరఫరా చేస్తుంది. కానీ, ఈ గ్లైకోజెన్ నిల్వలు కేవలం ఒక రోజు లేదా రెండు రోజులకు మాత్రమే సరిపోతాయి.
33
కొన్ని వారాలు బతకవచ్చు
రెండవ రోజు దాటిన తర్వాత శరీరంలో గ్లైకోజెన్ నిల్వలు ఖాళీ అయిపోతాయి. తరువాత శరీరం తన కణజాలాల్లోని కొవ్వు నిల్వలపై ఆధారపడుతుంది. ఈ దశను వైద్య పరిభాషలో 'కీటోసిస్' అంటారు. కాలేయం ఈ కొవ్వులను కరిగించి 'కీటోన్లు'గా మారుస్తుంది. ఈ కీటోన్లు రక్తం ద్వారా ప్రయాణించి మెదడుకు, గుండెకు గ్లూకోజ్‌కు ప్రత్యామ్నాయంగా శక్తిని అందిస్తాయి. శరీరంలో ఉన్న కొవ్వు నిల్వలను బట్టి ఒక మనిషి ఆహారం లేకుండా వారాల పాటూ జీవించగలడు. అయితే ఆహారం లేకుండా కొద్ది రోజులు బతగవచ్చు కానీ...'నీరు' లేకుండా మాత్రం 3 నుంచి 5 రోజుల కంటే ఎక్కువ కాలం బతకడం చాలా కష్టం.