సముద్రం మధ్యలో ‘ తియ్యటి నీరు’.. దీని వెనక సీక్రెట్ ఏంటి? శివాజీ మహారాజ్ కి ఇదెలా సాధ్యమైంది?

Published : Aug 13, 2026, 04:49 PM IST

సముద్రంలో ఎన్ని నీళ్లు ఉన్నా.. అవి మన దాహం తీర్చలేవు అనే మాట వినే ఉంటారు. ఎందుకంటే, సముద్రంలో ఉప్పు నీళ్లే ఉంటాయి. ఆ ఉప్పు నీటి మధ్యలో.. తీయని నీళ్ల బావి ఒకటి ఉందని మీకు తెలుసా?

PREV
13
సముద్రం మధ్యలో తియ్యటి నీటి సీక్రెట్..

చుట్టూ మైళ్ల కొద్దీ అరేబియా సముద్రం.. నోట్లో చుక్క కూడా పోసుకోలేని ఉప్పు నీరు, కానీ ఆ సముద్రం మధ్యలో ఒక చారిత్రక కోట.. ఆ కోటలోకి అడుగుపెడితే..తీయని నీరు దొరుకుతుంది. పాలు, పెరుగు, పంచదార పేర్లతో పిలిచే ఆ మూడు తీపి నీటి బావుల వెనక కథేంటి? ఉప్పు నీటి మధ్యలో తియ్యటి నీరు ఎలా సాధ్యం అయ్యింది? దీని వెనక సైన్స్ ఏంటి?

సింధూ దుర్గ్ కోట..

మహారాష్ట్రలోని మాల్వన్ తీరానికి కాస్త దూరంలో, అరేబియా సముద్రంలో ఉమ్మడి ద్వీపంపై నిర్మించినదే 'సింధుదుర్గ్ కోట' . ఛత్రపతి శివాజీ మహారాజ్ సైనిక వ్యూహంతో నిర్మించిన ఈ కోటలో శత్రువులు ఊహించని ఒక ప్రత్యేకత ఉంది.

కోట లోపల దూధ్‌బావ్ (Milk Well), సాఖర్‌బావ్ (Sugar Well), దహీబావ్ (Curd Well) అని పిలిచే మూడు ప్రత్యేకమైన బావులు ఉన్నాయి. సముద్రపు ఒడ్డున ఎంత తవ్వినా ఉప్పునీరే పడే చోట.. ఈ బావుల్లో మాత్రం తీయని తాగునీరు లభిస్తుంది.

23
చుట్టూ ఉప్పునీరు.. లోపల తీపి నీరు ఎలా సాధ్యం?

చాలామంది ఇది ఏదో దైవిక శక్తుల వల్ల లేదా అద్భుతం వల్ల జరుగుతోందని నమ్ముతారు. కానీ దీని వెనుక ఉన్నది సైన్స్ మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు.

ఫ్రెష్‌వాటర్ లెన్స్ : లక్షద్వీప్ వంటి సముద్ర ద్వీపాల్లోనూ ఈ ఫినామినా కనిపిస్తుంది. వర్షం పడినప్పుడు కోటలోని రాళ్లు, ఇసుక పొరల గుండా నీరు ఇంకి భూమి అడుగు భాగానికి చేరుతుంది.

సాంద్రతలో తేడా: సముద్రపు ఉప్పునీటి సాంద్రత (Density) ఎక్కువ.. వర్షపు మంచినీటి సాంద్రత తక్కువ. అందువల్ల భూగర్భంలో చేరిన మంచినీరు, సముద్రపు ఉప్పునీటిపై ఒక పలుచని పొరలా తేలియాడుతూ నిల్వ ఉంటుంది. బావులు తవ్వినప్పుడు ఈ మంచినీటి పొర నుంచే నీరు ఊరుతుంది.

33
శివాజీ మహారాజ్ మాస్టర్ ప్లాన్!

కోట నిర్మాణ సమయంలో శత్రువులు నెలల తరబడి ముట్టడి వేస్తే లోపల ఉన్న సైన్యానికి ప్రాణాధారం 'తాగునీరు'. కోట బయటకు వెళ్లకుండా సైనికులు ఏళ్ల తరబడి పోరాడేందుకు, ప్రకృతి సిద్ధమైన ఈ భూగర్భ జల వనరులను గుర్తించి అక్కడే బావులు తవ్వించారు.

Read more Photos on
click me!

Recommended Stories