Winter Fruits: చలికాలంలో మనం తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. చలికాలంలో కొన్ని రకాల పండ్లను తినకూడదు. వాటిని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు త్వరగా వచ్చేస్తాయి. ఏ పండ్లను దూరం పెట్టాలో తెలుసుకోండి.
చలికాలం వచ్చిందంటే చాలు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. రోగనిరోధక శక్తి కూడా తక్కువగా ఉండే కాలం ఇది. అందుకే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా చలికాలంలో జీర్ణవ్యవస్థ నెమ్మదిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. తింటే జలుబు, దగ్గు వచ్చే అవకాశం ఉంది. జీర్ణవ్యవస్థ కూడా దెబ్బతింటుంది. కాబట్టి చలికాలంలో ఏ పండ్లు తినకూడదో ఇక్కడ చూద్దాం.
26
పుచ్చకాయ
పుచ్చకాయ, కర్బూజ వంటి పండ్లలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. ఈ పండ్లు శరీరాన్ని చల్లబరుస్తాయి. వీటిని వేసవి కాలంలో తింటే ఎంతో ఆరోగ్యం. కానీ చలికాలంలో మాత్రం డేంజర్. వీటిలోని నీటిశాతం చలికాలంలో శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. మీ జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటే, వీటిని జీర్ణం చేసుకోవడం కష్టం. ఇవి కఫం, గొంతు సమస్యలను పెంచుతాయి.
36
పైనాపిల్
పైనాపిల్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీని మన రోగనిరధక శక్తిని పెంచుతుంది. వేసవిలో తింటే ఎంతో మేలు కానీ చలికాలంలో పైనాపిల్ తింటే నోటి పుండ్లు, గొంతునొప్పి, అలర్జీ వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు, దీన్ని ఎక్కువగా తింటే రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది.
నల్ల ద్రాక్షలో కూడా విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఈ పండ్లను అధికంగా తింటే మాత్రం దగ్గు, జలుబుకు కారణమవుతుంది. ఇందులో చక్కెర శాతం కూడా ఎక్కువ. కాబట్టి, చలికాలంలో ద్రాక్ష ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.
56
అరటిపండు
అరటిపండు తినడం మంచిదే కానీ.. చలికాలంలో అరటిపండు తింటే కఫం ఉత్పత్తి పెరుగుతుంది. అరటిపండు తినడం చలికాలంలో తగ్గించుకుంటే మంచిది.
66
చలికాలంలో తినాల్సిన పండ్లు
నారింజ, జామ, యాపిల్, దానిమ్మ, కివి వంటి పండ్లను చలికాలంలో తినడం ఆరోగ్యానికి మంచిది. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. శరీరానికి వెచ్చదనాన్ని కూడా అందిస్తాయి. కాబట్టి ప్రతి రోజూ ఇలాంటి పండ్లను తినేందుకు ప్రయత్నించండి.