
పప్పులు మన ఆరోగ్యానికి చాలా అవసరం. వీటిలో ఉండే ప్రోటీన్స్ (Proteins) మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇకపోతే పప్పుల్లో ఒకటైన ఉలవ పప్పును ఉపయోగించని వారు ఎవరూ ఉండరేమో. ఉలవ పప్పును దోశ, ఇడ్లీ, వడ మొదలైన వివిధ వంటల్లో ఉపయోగిస్తుంటారు. ఉలవ పప్పులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఉలవ పప్ప గుండె (Heart) సమస్యలు, మధుమేహం వంటి వ్యాధులు రాకుండా చేస్తాయి. మలబద్దకం, మూత్రపిండాల సమస్యలు ఉలవల పప్పును తినడం ద్వారా తగ్గుతాయి. ఉలవ పప్పులో యాంటీ ఆక్సిడెంట్ (Antioxidant)లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తి (Immunity)ని పెంచుతాయి.
ఉలవ (Horsegram ) పప్పు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా శాఖాహారులు (Vegetarians)ఈ పప్పు దినుసులను తప్పక తినాలి. శరీరానికి మంచిదని భావించే అనేక పోషకాలు ఉలవ పప్పులో లభిస్తాయి. ప్రోటీన్ తో పాటుగా ఉలవ పప్పులో కొవ్వులు (Fats), కార్బోహైడ్రేట్లు (Carbohydrates), విటమిన్ బి, ఐరన్, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు కూడా ఉన్నాయి. ఇవి అనేక వ్యాధుల నుండి మన శరీరాన్ని రక్షిస్తాయి. కానీ ఈ పప్పులో అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కొన్ని నష్టాలను కూడా కలిగి ఉంది. ఉలవ పప్పు అనేక ఆరోగ్య సమస్యలను నయం చేయగలిగినప్పటికీ కొంతమంది ఉలవ పప్పును తీసుకోవడం మంచిది కాదు. కొన్ని వ్యాధులు ఉన్నవారికి ఉలవ పప్పు తినడం ప్రాణాంతకం. మరి ఈ పప్పును ఎవరెవరు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
అజీర్ణం సమస్య ఉన్నవారికి మంచిది కాదు: అజీర్ణం (Indigestion)సమస్యలు ఉన్నవారు ఉలవ పప్పుకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఉలవ పప్పు కూడా త్వరగా జీర్ణం కాదు. ఇది తరచుగా మలబద్ధకం, కడుపులో వాయువు, కడుపు ఉబ్బరం మొదలైన సమస్యలకు దారితీస్తుంది.
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడే వారు: యూరిక్ యాసిడ్ (Uric acid)తో బాధపడేవారు కూడా ఉలవ పప్పుకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఉలవ పప్పు మూత్రపిండాలలో Calcification Stone ను పెంచుతుంది. ఒకవేళ యూరిక్ యాసిడ్ ఇప్పటికే రక్తంలో ఎక్కువగా ఉన్నట్లయితే ఉలవ పప్పును తినడం పూర్తిగా మానేయాలి.
ఆర్థరైటిస్ (Arthritis)ఉన్నవారికి మంచిది కాదు: కీళ్ల నొప్పులు (Arthritis) ఉన్నవారు కూడా ఉలవ పప్పును తినకూడదు. ఉలవ పప్పులో Gout సమస్యను పెంచే పదార్థాలు ఉంటాయి. అందుకే ఆర్థరైటిస్ తో బాధపడేవారు ఉలవ పప్పుకు దూరంగా ఉండటం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మూత్రపిండాల్లో రాళ్ల (Kidney stones) సమస్య: కిడ్నీ స్టోన్ తో బాధపడేవారు ఉలవ పప్పు తినడం మానుకోవాలి. ఉలవ పప్పు తీసుకోవడం వల్ల మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం లేదా మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదం పెరుగుతుంది.
100 గ్రాముల ఉలవ పప్పులో 26 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అందువలన ఇది ఆరోగ్యానికి అన్ని విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే కడుపునొప్పి, అజీర్ణంతో బాధపడేవారు ఈ పప్పును రాత్రంతా నానబెట్టి తీసుకోవాలి.