గులాబీ రేకులతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం..!

Published : Jun 14, 2022, 03:58 PM IST

గులాబీలు అందానికి మాత్రమే ఉపయోగపడుతాయి అనుకుంటాం కానీ గులాబీ రేకులలో (Rose petals) ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. మరి గులాబీ రేకులతో కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..    

PREV
16
గులాబీ రేకులతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం..!

గులాబీ రేకులలో విటమిన్ ఎ, బి3 లతో పాటు విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. అలాగే వీటితోపాటు క్యాల్షియం, ఐరన్, జింక్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. గులాబీ రేకులను తరచూ తీసుకుంటే శరీరానికి రక్త శుద్ధి (Purifying the blood) సక్రమంగా జరుగుతుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి వ్యాధులతో (Diseases) పోరాడే సామర్థ్యాన్ని పెంచుతాయి.
 

26

దీంతో శరీరంలో రోగనిరోధక శక్తి (Immunity) కూడా పెరుగుతుంది. ఈ గులాబీ రేకులలో ఉండే పోషకాలు జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి జీర్ణప్రక్రియ సాఫీగా జరిగేలా చేస్తాయి. అలాగే యూరినరీ సమస్యలను తగ్గించి మలబద్ధకం వంటి సమస్యలకు కూడ దూరంగా ఉంచుతాయి. దీంతో ఉదర ఆరోగ్యం (Abdominal health) కూడా మెరుగుపడుతుంది.

36

నిద్రలేమి (Insomnia) సమస్యతో బాధపడేవారు రాత్రి పడుకునే ముందు రోజ్ వాటర్ ను పిల్లోపై స్ప్రే చేసుకొని పడుకుంటే గాఢమైన నిద్ర పడుతుంది. అలాగే ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను దూరం చేసి మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. గులాబీ రేకులలో యాంటీసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మన చర్మాన్ని డీహైడ్రేట్ (Dehydrate) బారి నుంచి కాపాడుతాయి.
 

46

గులాబీ రేకులను చర్మ సౌందర్యం (Skin beauty) కోసం ఉపయోగిస్తే జిడ్డు చర్మ సమస్యలు తగ్గుతాయి. దీంతో చర్మానికి మంచి నిగారింపు అందుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) యు.వి కిరణాల నుంచి రక్షిస్తాయి. ఇది ఒక మంచి మాయిశ్చరైజర్ గా చర్మానికి సహాయపడి చర్మాన్ని తేమగా ఉంచుతుంది. గులాబీ రేకులను పాలలో వేసి మెత్తగా పేస్ట్ చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి.
 

56

ఇలా తరచూ చేస్తే మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే కంటి చుట్టూ ఉండే నల్లటి వలయాలు (Black circles) కూడా తగ్గుతాయి. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ (Anti-inflammatory) లక్షణాలు చర్మంపై ఏర్పడే దద్దుర్లు, దురదలు, పొక్కులు వంటివి సమస్యను తగ్గించి వయసు పైబడటంతో వచ్చే ముడతలను నివారిస్తాయి. దీంతో యవ్వనంగా కనిపిస్తారు.
 

66

అలాగే రోజు వాటర్ ను జుట్టు సౌందర్యం కోసం ఉపయోగిస్తే జుట్టు పొడిబారే సమస్యలు, జుట్టు రాలే సమస్యలు తగ్గుతాయి. అలాగే జుట్టుకు సహజసిద్ధమయిన రంగు లభిస్తుంది. ఇది జుట్టుకు మంచి కండిషనర్ (Conditioner) గా ఉపయోగపడి జుట్టు ఆరోగ్యాన్ని (Hair health) మెరుగుపరుస్తుంది. అలాగే శరీర దుర్వాసనతో బాధపడేవారు గులాబీ రేకులను నీళ్లలో వేసుకొని  స్నానం చేస్తే శరీరానికి మంచి సువాసన అందుతుంది. అలాగే చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

click me!

Recommended Stories