బలహీనత: ఉలవల్లో ఎక్కువ మోతాదులో ప్రోటీన్లు, ఫాస్పరస్, ఐరన్, కాల్షియం ఉంటాయి. ఇవి మనిషిని బలంగా, ధ్రుడంగా చేస్తాయి. అయితే ఎవరైతే చిన్న చిన్న పనులను చేసినా తొందరగా అలసిపోతారో అటువంటి వారు కొన్నిరోజుల పాటు క్రమం తప్పకుండా మీ రోజు వారి ఆహారంలో ఉలవలను చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే శరీరంలో రక్తం తక్కువగా ఉన్న వారికి కూడా ఉలవలు బాగా ఉపయోగపడతాయి.