Relationship tips: ప్రతి మహిళా తన జీవితంలోకి వచ్చే వారు గుడ్ క్వాలిటీస్ తో ఉండాలనీ, ఎల్లలు లేని ప్రేమను పంచే వారే తమ జీవిత భాగస్వామిగా రావాలని కోరుకుంటూ ఉంటారు. కోరుకున్న క్వాలిటీస్ ఉన్నవారు తమ జీవితంలోకి వస్తే ఎన్నో ఎంత సంతోషంగా ఉంటుందో మాటల్లో చెప్పలేరు కదూ.. అయితే మీ భాగస్వామి మీతో ఎలా అయితే ప్రేమగా ఉంటారో.. మీ భాగస్వామి విషయంలో కూడా మీరు అలాగే ప్రవర్తించాలి. మీ భాగస్వామి కొన్ని కొన్ని సార్లు పొరపాట్లు చేసినా వాటిని పెద్దవి చేసి చూపకూడదు. అలాగే వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే మీ భాగస్వామిని అర్థం చేసుకున్నవారవుతారు.
సమయం: గడిచిన కాలం ఎన్నటికీ తిరిగిరానిది. ఇప్పుడున్న సమయమే మనది. అందులో మీ భాగస్వామితో ఆనందంగా గడిపిన క్షణాలే మీకు మధురానుభూతులు. వారితో గడిపిన క్షణకాలం కూడా ఎంతో విలువైదని . కాబట్టి వారికి మీరు ఎంత సమయం కేటాయిస్తున్నారో చూసుకోండి. వారికి మీరు ఎంత ఎక్కువ సమయాన్ని కేటాయిస్తే అంత ఎక్కువ ప్రేమ పెరుగుతుందట. ఆఫీసు పనులు, ఇంటి పనులు ఎప్పుడూ ఉండేవే. కానీ వీలు చూసుకుని ఔటింగ్ కు వెళ్లడం అలవాటు చేసుకోంండి. అటువంటి సమయాల్లోనే మీ భాగస్వామితో మనస్ఫూర్తిగా మాట్లాడటానికి వీలుంటుంది.
కరుణ: మీ భాగస్వామితో తరచుగా కటువుగా మాట్లాడకండి. ఎందుకంటే కొందరి మనస్సులు చాలా సున్నితంగా ఉంటాయి. దానివల్ల వారికి మీపై ప్రేమ కోల్పోయే అవకాశం ఉంది. అందుకే అతని విషయంలో కాస్త కరుణగా ఉండండి. అతడి ఒక్క విషయంలోనే కాదు అతని కుటుంబం పట్ల బాధ్యతగా నడుచుకోండి. మీ కుటుంబం ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు నాకేంటి అని అనుకోకుండా మీ వల్ల ఆ సమస్య సాల్వ్ అవుతుందనుకుంటే ఖచ్చితంగా చేయండి. అప్పుడే మీరు మీ ఫ్యామిలీ సంతోషంగా ఉంటుంది.
ప్రోత్సాహం: మంచి భాగస్వామి ఎప్పుుడు వారి భాగస్వామికి అన్ని విషయాల్లో అండగా ఉండటమే కాదు.. వారు ఏది చేయాలనుకున్నా ప్రోత్సహిస్తారు. అలాగే ఆ పని పూర్తయ్యే వరకు తమకు అండగా నిలబడతారు. మంచి భాగస్వామి ఎప్పుడూ ఇది వద్దు అది వద్దు.. ఏమీ చెయ్యక్కర్లేదని నిరాశ పరచరు. ఒకవేళ అది మంచిదిగా అనిపించకపోతే .. నచ్చజెప్పి వేరే వాటిని చూస్ చేసుకోమని సలహాలనిస్తుంటారుు. మన అభిప్రాయాలను ఆనందంగా స్వీకరించినప్పుడే వారిరువురు ఆనందమైన లైఫ్ ను లీడ్ చేయగలుగుతారు.
ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా సమస్యలు లేని ఇళ్లంటూ ఉండదేమో. కానీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా ఒక పరిష్కారం ఉంటుంది. ఒక సమస్య తలెత్తినప్పుడు దానిని అందరూ అంగీకరించి తర్వగా పరిష్కరించుకోవాలి. కానీ అదెలా చేస్తావు అనే విధంగా ప్రవర్తించకూడదు.
ఇది భార్య మాత్రమే చేసే పని.. ఇది భర్త మాత్రమే చేసే పని అంటూ ఎప్పుడూ పనులను విడదీసి మాట్లాడకూడదు. ఇంట్లో ఎటువంటి పనినైనా ఇద్దరు భాగస్వాములు కలిసి చేసుకుంటే పని త్వరగా అయిపోవడమే కాదు.. ఆనందంగా కూడా అనిపిస్తుంది. వైవాహిక జీవితంలో జట్టుగా చేసే పనులు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి తెలుసా..