తుంటి నొప్పికి అధిక కొలెస్ట్రాల్ ఒక కారణమా?

First Published Nov 28, 2022, 3:56 PM IST

పిరుదుల్లో నొప్పికి కొలెస్ట్రాల్ కూడా ఒక కారణమేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. దీన్ని లైట్ తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్నారు. 
 

High Cholesterol

చెడు కొలెస్ట్రాల్ ను సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది మన శరీరంలో పేరుకుపోయి ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది అధిక కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారు. చెడు కొలెస్ట్రాల్ మీ శరీరంలో పెరుగుతుందనడానికి ముందస్తుగా మీ శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. దీనిని గమనిస్తే.. దీన్ని నివారించగలుగుతారు. ఎన్నో రోగాల నుంచి సేఫ్ గా ఉంటారు. నిజానికి అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు ప్రారంభ దశలో అంతగా కనిపించవు. కానీ బాగా గమనిస్తే.. సులువుగా గుర్తించవచ్చు. 


నిజానికి అధిక కొలెస్ట్రాల్ రక్తనాళాల లోపల ఫలకాలను ఏర్పరుస్తుంది. ఈ ఫలకాలు నాళాల్లో రక్త ప్రవాహాన్ని పరిమితం చేస్తాయి. రక్తప్రవాహం సరిగ్గా లేకపోవడం వల్ల ఎన్నో కండరాలకు తగినంత ఆక్సిజన్ అందదు. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో నొప్పి కలుగుతుంది. ఇక కండరాలు శారీరక శ్రమలో పాల్గొన్నప్పుడు విపరీతమైన నొప్పి పుడుతుంది. 

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. అధిక కొలెస్ట్రాల్ మూలంగా ప్రభావితమయ్యే కండరాల్లో తుంటి కండరాలు ఒకటి. అధిక కొలెస్ట్రాల్ వల్ల చాలా మందిలో తుంటి ప్రాంతంలో భయంకరమైన నొప్పి కలుగుతుంది. అయితే ఈ నొప్పి కొలెస్ట్రాల్ వల్లే వస్తుందని తెలియకపోవడం, దీన్ని లైట్ తీసుకోవడం వల్ల నొప్పి పెరిగిపోతుంది. 

అయితే ఈ తుంటి  నొప్పి.. అస్థిపంజర నిర్మాణం లేదా ఎముకల సమస్యలకు సంబంధించిందింగా అనుకుంటారు. అలాగే ఆర్థరైటిస్ వంటి ఎముకులకు సంబంధించిన సమస్య వల్లే తుంటి నొప్పి వస్తుందని అనుకోవడం వల్లే ఇలా జరుగుతుంది. 

కానీ అధిక కొలెస్ట్రాల్ వల్లే హిప్ కండరాలు నొప్పి పుడతాయని చాలా మందికి తెలియదు. నిజానికి కొలెస్ట్రాల్ ఆ ప్లేస్ పేరుకుపోవడంతో రక్తప్రవాహం పరిమితం అవుతుంది. దీనివల్ల పరిధీయ ధమని వ్యాధి లేదా పిఎడి సమస్య వస్తుంది. ఇది పిరుదులు, కాళ్లు, పాదాలను ప్రభావితం చేస్తుందని ఆరోగ్య నివేదికలు వెల్లడిస్తున్నాయి. 
 

Image: Getty Images

సంకేతాలు

ఏ చిన్న పనిచేసినా పిరుదుల్లో నొప్పి కలిగితే వెంటనే డాక్టర్ దగ్గరకు వెల్లండి. కొలెస్ట్రాల్ వల్ల నడుస్తుంటే కూడా నొప్పి కలుగుతుంది. ఈ నొప్పి పిరుదులు, తొడ, వీపునకు కూడా చేరుకుంటుంది. 

అయితే కొలెస్ట్రాల్ స్థాయిలు, ఫలకం ఏర్పడటం వల్ల రక్తప్రవాహం నిరోధించబడే ప్రాంతాలను బట్టి నొప్పి తీవ్రత ఆధారపడి ఉంటుంది. ఇది ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. 

సాధారణంగా ఈ నొప్పి విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది. కానీ శారీరక శ్రమ చేస్తే మాత్రం మళ్లీ వస్తుంది. పిఎడి ఇతర సంకేతాలు.. పాదాలలో చర్మ రంగులో మార్పు, గోళ్ల రంగు మారడం. 

ఇతర సంకేతాలు: కాళ్లపై జుట్టు రాలడం, కాళ్లలో తిమ్మిరి, పాదాలపై పుండ్లు, కాళ్లలో తిమ్మరి, కాళ్ల రంగు పాలిపోవడడం, పెళుసైన కాలి గోర్లు, మెరిసే చర్మం, పురుషుల్లో అంగస్తంభన పనిచేయకపోవడం, కాళ్ల కండరాలు కుంచించుకుపోవడం. 
 

High Cholesterol

ఇది ఎందుకు ఇగ్నోర్ చేయబడుతోంది? 

ఎందకంటే తుంటి నొప్పి సాధారణంగా  వృద్ధాప్యం లేదా ఎముకలకు సంబంధించిన వ్యాధుల వల్లే వస్తుంది. ఇక మహిళలు చాలా చిన్న వయసు నుంచి, ఎన్నో సందర్భాల్లో తుంటి నొప్పితో ఇబ్బంది పడతారు. అందుకే అధిక కొలెస్ట్రాల్ వల్ల వచ్చిందని గుర్తించకపోవడం వల్ల ఇగ్నోర్ చేయబడుతోంది. 
 

cholesterol


ప్రాసెస్ చేసిన ఆహారాలు, వేయించిన ఆహారాలు,  కృత్రిమ మూలకాలతో నిండిన ఆహారాల వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు దారుణంగా పెరిగిపోతాయి. అందుకే కొలెస్ట్రాల్ ను పెంచే ఆహారాలను అసలే తినకండి. కేకులు, రెడ్ మీట్, కొవ్వు మాంసం, బిస్కెట్లు, పామాయిల్, హార్డ్ చీజ్, క్రీమ్, వెన్న వంటి ఆహారాలకు దూరంగా ఉండండి. 

పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను మీ రోజు వారి ఆహారంలో చేర్చండి. ఇవి మీ శరీరానికి అవసరమైన స్థూల, సూక్ష్మ పోషకాలను అందిస్తాయి. 
 

click me!