పురుషులు కచ్చితంగా ఫాలో అవ్వాల్సిన స్కిన్ కేర్ రూల్స్....!

First Published Nov 28, 2022, 3:34 PM IST

స్కిన్ కేర్ ఫాలో అవ్వకపోతే... పురుషులు స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడం, ముఖంపై మొటిమలు, ముడతలు రావడం లాంటివి వస్తాయి. 

men skin care

స్కిన్ కేర్ అనగానే అందరూ... అమ్మాయిలే ఫాలో అవ్వాలి అనుకుంటారు. నిజం చెప్పాలంటే... వారే ఆ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ... పురుషులు కూడా స్కిన్ కేర్ రోటీన్ ని ఫాలో అవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. స్కిన్ విషయంలో  పురుషులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఓ సారి చూద్దాం..

స్త్రీలతో పోలిస్తే... పురుషుల చర్మంలో కొలాజిన్, ఎలాస్టిన్ లు ఎక్కువగా ఉంటాయి. అందుకే... పురుషుల చర్మం మందంగా ఉంటుంది. దాని కారణంగా పురుషులు వయసు కు మించి ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. కాబట్టి... అలా కనిపించకుండా ఉండాలంటే.. వారు స్కిన్ కేర్ ని కచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే.

స్కిన్ కేర్ ఫాలో అవ్వకపోతే... పురుషులు స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడం, ముఖంపై మొటిమలు, ముడతలు రావడం లాంటివి వస్తాయి. 


స్కిన్ కేర్ ఫాలో అవ్వడం అంటే.. ఏ క్రీము పడితే అది వాడేయడం కాదు. మీ చర్మానికి తగిన క్రీములను మాత్రమే వాడాలి. దాని కోసం ముందుగా... మీ స్కిన్ టైప్ ఎలాంటిదో తెలుసుకోవాలి. మీది యాక్నే ప్రో స్కిన్  అయితే...  ఆయిల్ ఫ్రీ ప్రోడక్ట్స్ వాడటం నేర్చుకోవాలి.

జిడ్డు చర్మం ఉన్న అబ్బాయిలు, నార్మల్ చర్మం ఉన్నవారు అయినా సరే... రెగ్యులర్ గా క్లెన్సింగ్ చేస్తూ ఉ:డాలి. రోజుకి కనీసం.. మూడు, నాలుగు సార్లు అయినా.. ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై దుమ్ము, దూళి లాంటివి పడకుండా ఉంటాయి. చర్మం శుభ్రపడుతుంది.


చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకునేందుకు... ముఖానికి ప్రతిరోజూ మాయిశ్చరైజర్ రాయడం  అలవాటు చేసుకోవాలి. అంతేకాదు.. చర్మం మృదువుగా మారడానికి కూడా సహాయం చేస్తుంది.

షేవింగ్ లేదాట్రిమ్మింగ్ తరచూ ఉపయోగించడం వల్ల.. చర్మం మీద దురద, రెడ్ నెస్ లాంటివి రావడం, చర్మం మరింత  రఫ్ గా మారడం లాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి... షేవింగ్ సమయంలో... షేవ్ బామ్స్ వాడటం అలవాటు చేసకోవాలి. దీని వల్ల.. చర్మం రఫ్ గా మారకుండా.. ఉంటుంది. 

అంతేకాకుండా... ప్రతిరోజూ... కాలంతో సంబంధం లేకుండా ప్రతిరోజూ సన్ స్క్రీన్ లోషన్ ని వాడటం అలవాటు చేసుకోవాలి. సన్ స్క్రీన్ లోషన్ వాడటం వల్ల... ముఖం పై మడతలు రావడం, ఏజ్ స్పాట్స్ రావడం లాంటి సమస్యలు తగ్గుతాయి.

వయసు ఎక్కువగా కనిపించకుండా ఉండేందుకు సిరమ్ వాడటం అలవాటు చేసుకోవాలి. విటమిన్ సి సీరమ్ ని స్కిన్ కేర్ రోటిన్ లో భాగం చేసుకోవాలి. కంటి కింద కూడా ఐ జెల్ ని వాడటం వల్ల... డార్క్ సర్కిల్స్ లాంటివి రాకుండా ఉంటాయి.

click me!