Published : Sep 13, 2022, 02:12 PM ISTUpdated : Sep 13, 2022, 02:13 PM IST
మానసిక ఒత్తిడి, ఉప్పును ఎక్కువగా తీసుకోవడం, ఊబకాయం, మద్యపానం, స్మోకింగ్ వంటివి రక్తపోటును అమాంతం పెంచుతాయి. ఇక ఈ రక్తపోటు హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి ప్రమాదాలకు దారితీస్తుంది.
బిజీ లైఫ్ కారణంగా చాలా మంది ఆరోగ్యం గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దీని వల్ల రక్తపోటు విపరీతంగా పెరగడం, తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యను ఫేస్ చేసే వారు చాలా మందే ఉన్నారు. అందులోనూ యువతే ఈ సమస్య బారిన ఎక్కువగా పడుతున్నారు.
28
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. మానసిక ఒత్తిడి, మద్యపానం, ఉప్పును ఎక్కువగా తీసుకోవడం, ధూమపానం, ఊబకాయం వంటివి రక్తపోటును పెంచుతాయి. రక్తపోటు వల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి ఎన్నో ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముంది.
38
high blood pressure
రక్తపోటు ఎక్కువగా ఉన్నవారు ఉప్పును ఎక్కువగా తీసుకోకూడదు. హైబీపీ సమస్యతో బాధపడేవారు రోజుకు ఆరు గ్రాముల కంటే తక్కువ ఉప్పును తీసుకోవాలి. అయితే ఈ రక్తపోటును నియంత్రించడానికి పొటాషియం బాగా సహాయపడుతుంది. అందుకే అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాలను ఎక్కువగా తినాలి. ఇందుకోసం ఎలాంటి ఆహారాలను తినాలో తెలుసుకుందాం పదండి.
48
banana
అరటిపండ్లు
రోజూ ఒక అరటిపండు తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. ఈ అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఒక మీడియం సైజు అరటిలో 422 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. పొటాషియం రక్తనాళాల గోడలో ఉద్రిక్తతను తగ్గిస్తుంది. కాబట్టి అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు అరటిపండ్లను రోజూ తినండి.
58
Avocado
అవొకాడో
అవొకాడోలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఫోలేజ్ తో పాటుగా పొటాషియం కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది రక్త పోటును నియంత్రణలో ఉంచుతుంది. ఇవి గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.
68
పుచ్చకాయ
పుచ్చకాయలో వాటర్ కంటెంట్ తో పాటుగా విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పుచ్చకాయను తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
78
పెరుగు
పెరుగులో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీనిలో పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. అందుకే అధిక రక్తపోటుతో బాధపడేవారు రోజుకు ఒక కప్పైనా పెరుగును తినండి. పెరుగులో మన శరీరానికి మేలు చేసే మంచి బ్యాక్టీరియా ఉంటుంది. జీర్ణ, పేగు సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి.
88
leafy vegetables
ఆకు కూరలు
ఆకుకూరలు మన శరీరానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో పోషకాలు అందుతాయి. వీటిలో పొటాషియం కూడా సమృద్ధిగా ఉంటుంది. బ్రోకలీ, బచ్చలికూర వంటి వాటిని మీ రోజు వారి ఆహారంలో చేర్చండి. ఇవి అధిక రక్తపోటును నియంత్రించడానికి సహాయపడతాయి.