కరివేపాకును ఇలా ఉపయోగిస్తే.. మీ జుట్టు బాగా పెరుగుతుంది..

First Published Sep 13, 2022, 12:46 PM IST

కరివేపాకు ఆరోగ్యానికే కాదు.. జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ప్రోటీన్లు, యాంటీ  ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు బలంగా, ఒత్తుగా పెరిగేందుకు సహాయపడతాయి. 
 

కరివేపాకులో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. కానీ చాలా మంది కూరలో కరివేపాకును దేనికీ పనికిరాదన్నట్టు పక్కన పెట్టేస్తుంటారు. కరివేపాకు బరువును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.  అలాగే శరీరం నుంచి విషాలను తొలగిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును సైతం తగ్గిస్తుంది. కరివేపాకు జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. 
 

కరివేపాకును తినడం వల్ల బ్లాడర్, యూరిన్ సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఇందుకోసం కరివేపాకు జ్యూస్ లో కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్ ను వేసుకుని తాగాలి. కరివేపాకు బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కూడా నియంత్రణలో ఉంచుతాయి. ఇది మార్నింగ్ సిక్నెస్ ను కూడా పోగొడుతుంది. కంటిని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది స్కిన్ ఇరిటేషన్ ను కూడా తగ్గిస్తుంది. 

కరివేపాకులో ఓవర్ వెయిట్ ను తగ్గించడానికి సహాయపడే అనేక కారకాలు ఉంటాయి. ఈ కరివేపాకు జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది. ఉదయం లేవగానే ఒక గ్లాసు నీటిని తాగి.. ఆ తర్వాత   కొన్ని నిమిషాల తర్వాత తాజా కరివేపాకు ఆకులను నిమిలి తినాలి. ఒక అరగంట తర్వాత బ్రేక్ ఫాస్ట్ ను తినొచ్చు. కరివేపాకులో విటమిన్ సి, ఐరన్, ఫాస్పరస్, క్యాల్షియం, నికోటినిక్ యాసిడ్ లు పుష్కలంగా ఉంటాయి.
 

కరివేపాకు మన జుట్టుకు ఎంతో మేలు చేస్తుందని చాలా మందికి తెలుసు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు  పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు మీ జుట్టును ఆరోగ్యంగా, బలంగా పెరగడానికి సహాయపడతాయి. 
 

కరివేపాకు హెయిర్ మాస్క్ ను వేసుకోవడం వల్ల మీ జుట్టు పట్టుకుచ్చులా మారుతుంది. ఈ హెయిర్ మాస్క్ తయారు చేసుకోవాలంటే కరివేపాకు పేస్ట్, పెరుగు ఉంటే సరిపోతుంది. రెండు టీస్పూన్ల కరివేపాకు పేస్టును తీసుకుని అందులో పెరుగును కలిపి జుట్టుకు అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత జుట్టును క్లీన్ చేయాలి. ఈ హెయిర్ మాస్క్ మాడు నుంచి అన్ని మృత కణాలను, చుండ్రును తొలగిస్తుంది. కరివేపాకులో ఉండే పోషకాలు ఫోలికల్స్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
 

జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి, పెరగడానికి నెత్తి పరిశుభ్రంగా ఉండాలి. లేదంటే జుట్టు ఊడిపోయే ప్రమాదం ఉంది. అందుకే క్రమం తప్పకుండా మీ జుట్టుకు నూనె రాసుకోండి. కొబ్బరి నూనెలో కరివేపాకులు వేసి బాగా మరిగించి.. చల్లారిన తర్వాత జుట్టుకు అప్లై చేసుకుంటే జుట్టు నల్లగా పెరుగుతుంది. ఈ నూనెలో ఉండే కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతాయి. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలే కాదు ఐరన్ కంటెంట్ కూడా ఉంటుంది. ఇవి జుట్టు రాలడాన్ని ఆపుతుంది. జుట్టు మూలాలను బలోపేతం చేయడానికి కూడా సహాయపడతాయి. 
 

click me!