బ్లడ్ గ్రూప్ 'A' (A+, A-)
వీరు కిడ్నీ బీన్స్ (రాజ్మా వంటివి) తినకుండా దూరంగా ఉండాలి. ఇతర రకాల బీన్స్ తీసుకోవచ్చు. ఎక్కువగా మొక్కల ఆధారిత ఆహారాన్ని అంటే కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడం మంచిది.
బ్లడ్ గ్రూప్ 'O' (O+, O-)
ఇది అత్యంత పురాతనమైన బ్లడ్ గ్రూప్. వీరు తక్కువ కార్బోహైడ్రేట్లు, ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని తింటే అన్ని విధాలా మంచిది.
బ్లడ్ గ్రూప్ 'B' (B+, B-)
సంచార జీవనం, జంతువులను మేపడం ప్రారంభమైన కాలంలో ఈ రక్త వర్గం పుట్టింది. వీరు మాంసాహారం, పాల ఉత్పత్తులను ఆహారంలో ఎక్కువగా తీసుకోవచ్చు.
బ్లడ్ గ్రూప్ 'AB' (AB+, AB-)
ఇది సుమారు 1,000 సంవత్సరాల క్రితం మాత్రమే పుట్టిన కొత్త రక్త వర్గం. వీరు టర్కీ కోడి మాంసం, సోయాతో చేసిన టోఫు, సముద్రపు ఆహారం, రకరకాల కూరగాయలు ఎక్కువగా తీసుకుంటే మంచిది.