బేకింగ్ సోడా పద్ధతి: తేలికపాటి మురికి , మరకలను తొలగించడానికి ఇది గొప్ప పరిష్కారం. బేకింగ్ సోడాను కొద్దిగా నీటితో కలిపి చిక్కటి పేస్ట్ లా తయారు చేసి పగుళ్లపై పూయాలి. 5 నుండి 10 నిమిషాలు బాగా నానిన తర్వాత, పాత టూత్‌బ్రష్‌తో మెల్లగా రుద్ది పొడి క్లాత్‌తో తుడిస్తే సరిపోతుంది.
డిష్ వాష్ లిక్విడ్: సబ్బు , నూనె మరకలను పోగొట్టడానికి, కొన్ని చుక్కల డిష్‌వాషింగ్ లిక్విడ్‌ను గోరువెచ్చని నీటిలో కలిపి మృదువైన బ్రష్‌తో రుద్దాలి. ఆ తర్వాత నీటితో కడిగితే మరకలు తొందరగా వదులుతాయి.
వైట్ వెనిగర్: బాత్రూమ్ టైల్స్‌పై పేరుకుపోయిన మొండి మురికిని తొలగించడానికి వైట్ వెనిగర్ బాగా పనిచేస్తుంది. దీనిని మరకలపై చల్లి, కాసేపటి తర్వాత బ్రష్‌తో రుద్దితే మరకలు సులభంగా వదులుతాయి. అయితే వెనిగర్‌ను పాలరాయి (Marble) , గ్రానైట్ ఉపరితలాలపై అసలు వాడకూడదు, ఇది వాటి మెరుపును దెబ్బతీస్తుంది.
అలాగే మరకలు వదిలించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ స్క్రబ్బర్లు వాడకూడదు. టైల్స్‌కు గీతలు పడకుండా కేవలం మృదువైన నైలాన్ బ్రష్‌లను లేదా క్లాత్‌ను మాత్రమే ఉపయోగించాలి.
సరైన గాలి ప్రసరణ లేకపోవడం వల్ల బాత్రూమ్లో నలుపు, ఆకుపచ్చ రంగులో మురికి పేరుకుపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదా కిటికీ ద్వారా గాలి చక్కగా ఆడేలా చూసుకోవాలి.
బాత్రూమ్ ఎప్పుడూ మెరిసిపోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు: స్నానం చేసిన వెంటనే నేల, గోడలపై నిలిచిన నీటిని వైపర్‌తో తుడిచివేయడం మంచిది.
ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదా కిటికీని ఉపయోగించి బాత్రూమ్లో తేమను ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకోవాలి.