Dry Coconut: ట్రైన్ లో కొబ్బరికాయ తీసుకెళ్లడం నేరమా? ఎండు కొబ్బరిపై నిషేధం ఎందుకు..?

Published : Sep 17, 2026, 06:09 PM IST

Dry Coconut: భారతీయులు రెగ్యులర్ గా కొబ్బరికాయను వాడుతూనే ఉంటారు. దేవుడికి పూజ దగ్గర నుంచి.. వంటల వరకు కొబ్బరికాయ వాడతారు. అయితే అలాంటి కొబ్బరికాయను రైళ్లలో అనుమతించరని మీకు తెలుసా? దాని వెనక కారణం ఏంటి?

PREV
13
Dry Coconut

ప్రయాణాల్లో కొబ్బరికాయ తీసుకువెళ్లడం మనకు చాలా సాధారణ విషయంగా అనిపిస్తుంది. పూజల దగ్గర నుంచి వంటల వరకు పండగలకు కొబ్బరికాయలను మనం వెంట తీసుకువెళ్తూ ఉంటాం. అయితే, భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం.. పీచు ఉన్న ఎండు కొబ్బరికాయలను రైలులో తీసుకువెళ్లడం చట్టరిత్యా నేరం. ఇది వినడానికి వింతగా ఉన్నా.. దీని వెనక చాలా పెద్ద కారణమే ఉంది.

23
ఎండు కొబ్బరి ఎందుకు ప్రమాదకరం?

రైళ్లలో కొబ్బరికాయ తీసుకువెళ్తే ఏమౌతుంది అని అనుకోవచ్చు. అయితే.. నిజానికి కొబ్బరితో ఎలాంటి సమస్య లేదు. కానీ.. దానిపైన ఎండిపోయిన పీచు, ఎండు కొబ్బరిలో ఉండే నూనెతోనే అసలు సమస్య. ఎందుకంటే…ఎండు కొబ్బరి పీచు చాలా త్వరగా మంటలను పట్టుకుంటుంది. చిన్న నిప్పురవ్వ పడినా ఇది క్షణాల్లో అంటుకుంటుంది.

బోగీల్లో పెను ప్రమాదం: ప్రయాణికులు, లగేజీతో కిక్కిరిసిపోయే రైలు బోగీల్లో ఎండు కొబ్బరి వల్ల మంటలు చెలరేగితే.. అది చాలా వేగంగా వ్యాపించి పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది.

డేంజరస్ లగేజ్ జాబితా: అందుకే రైల్వే శాఖ గ్యాస్ సిలిండర్లు, కిరోసిన్, బాణసంచా , రసాయనాలతో పాటు 'ఎండు కొబ్బరి'ని కూడా ప్రమాదకరమైన వస్తువుల జాబితాలో చేర్చింది.

33
నిబంధనలు అతిక్రమిస్తే ఏమవుతుంది?

రైల్వే భద్రతా చట్టాల ప్రకారం అనుమతి లేని, ప్రమాదకరమైన వస్తువులను రైలులో తీసుకెళ్లడం తీవ్రమైన నేరం. నియమాలను ఉల్లంఘిస్తే భారీ జరిమానా లేదా జైలు శిక్ష లేదా రెండూ.. పడే అవకాశం ఉంది.

ఒకవేళ మీరు తీసుకెళ్లిన వస్తువు వల్ల రైల్వే ఆస్తికి నష్టం వాటిల్లినా, ప్రయాణికుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడినా మరింత కఠినమైన చట్టపరమైన చర్యలు ఉంటాయి. చూడటానికి సాధారణ కొబ్బరికాయలాగే కనిపించినా.. రద్దీగా ఉండే రైలు ప్రయాణంలో దాని ఎండు పీచు ఒక పెద్ద అగ్నిప్రమాదానికి కారణం కాగలదు. అందుకే ప్రయాణాల్లో ఈ విషయంలో జాగ్రత్త వహించడం చాలా అవసరం.

Read more Photos on
click me!

Recommended Stories