Heart Attack: గుండెపోటు రాకూడదంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!

First Published Aug 26, 2022, 4:54 PM IST

 రాత్రిపూట లేట్ గా పడుకోవడం చాలా మందికి అలవాటైపోయింది. కానీ ఇది గుండె ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తుంది. 
 

heart attack

మన జీవనశైలే మన గుండెను దెబ్బతీస్తుందన్న ముచ్చట మీకు తెలుసా.. కానీ ఇది దీర్ఘకాలంలో గుండెపోటుకు దారితీస్తుంది. చెడు జీవన శైలి, చెడు ఆహారపు అలవాట్ల వల్ల నేడు ఎంతోమంది చిన్న వయసు వారు గుండెపోటు బారిన పడుతున్నారు. ఇవే కాదు ఎన్నో రకాల రోగాలు కూడా వస్తున్నాయి. అందుకే గుండెపోటు రాకూడదంటే.. ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో తెలుసుకుందాం పదండి.

smoking

ధూమపానం

స్మోకింగ్ అలవాటును మానుకోవడం అంత సులువు కాదు. కానీ స్మోకింగ్ లివర్ నే కాదు .. గుండె ఆరోగ్యాన్ని కూడా పాడుచేస్తుంది. స్మోకింగ్ వల్ల గుండెపోటుతో సహా ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. 
 

శారీరక శ్రమ

శారీరక శ్రమ ప్రతి ఒక్కరికీ అవసరమే. ఎందుకంటే ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. వయస్సు, ఆరోగ్య స్థితిని బట్టి శారీరక శ్రమలో పాల్గొనడం తప్పనిసరి.  లేకుంటే గుండె పనితీరు దెబ్బతింటుంది. అదే సమయంలో అధిక వ్యాయామం కూడా గుండెకు అంత మంచిది కాదు. ఇది గుండె ఆగిపోవడానికి కారణం అవుతుంది. 
 

ఆరోగ్యకరమైన ఆహారం

ఆరోగ్యకరమైన ఆహారంతోనే మీరు హెల్తీగా, ఫిట్ గా ఉంటారు. కానీ నేడు ఎంతో మంది ఆరోగ్యానికి చేటు చేసే ఆహారాలనే ఎక్కువగా తింటున్నారు. కానీ దీర్ఘకాలం పాటు ఈ ఆహారాలనే తింటే చివరికి గుండె ప్రమాదంలో పడుతుంది. ఈ ఫుడ్ కూడా గుండెపోటుకు దారితీస్తుంది. 
 

నిద్రలేమి

ఈ మధ్యకాలంలో అర్థరాత్రి వరకు నిద్రపోకుండా.. టీవీ, సెల్ ఫోన్లలో ఉంటూ సోషల్ మీడియాల్లో గడుపుతున్నారు. ముఖ్యంగా కోవిడ్ ఎంట్రీ నుంచి చాలా మంది ఈ అలవాటును చేసుకున్నారు. కానీ మీరు రాత్రిపూట కంటినిండా నిద్రపోకపోతే మీ గుండె ఆరోగ్యం రిస్క్ లో పడుతుంది.  తరచుగా నిద్రలేమి సమస్య ఉంటే గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.
 

ఒత్తిడి

ప్రస్తుత కాలంలో చాలా మంది ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను ఫేస్ చేస్తున్నారు. అందుకే ఒత్తిడి , ఆందోళన వంటి సమస్యలను తగ్గించుకోండి. ఈ ఒత్తిడి గుండెను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
 

అధిక రక్తపోటు

గుండెపోటుకు దారితీసే ప్రధాన కారణాల్లో అధిక రక్తపోటు ఒకటి. అందుకే రక్తపోటు సమస్యతో బాధపడేవారు ఈ సమస్యను అదుపులో ఉంచుకోవాలి. ఇలాంటి వారు తరచుగా పరీక్షలు చేయించుకుంటూ..  జాగ్రత్తగా ఉండాలి.

షుగర్ వ్యాధి

బీపీతో పాటు షుగర్ వ్యాధి కూడా గుండెను ప్రమాదంలో పడేస్తుంది. మీ కుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్ ఉంటే.. కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ సమస్య ఉన్నవారు దీన్ని ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకకోవాలి. లేకపోతే మీ గుండె దెబ్బతింటుంది. 
 

click me!