కాఫీ తాగడానికే కాదు.. జుట్టుకు కూడా ఇలా పనికొస్తుంది..!

First Published Aug 26, 2022, 3:50 PM IST

జుట్టుకు కాఫీ ని ఉపయోగించడం వల్ల జుట్టు వేగంగా పెరగడంతో పాటుగా హెయిర్ ఫాల్ సమస్య కూడా తగ్గుతుంది. 

అమ్మాయిలు అందంగా ఉండాలంటే ఆకర్షణీయమైన ముఖమే కాదు.. అందమైన జుట్టును కూడా ఉండాలి. ఎంత తెల్లగా ఉన్నా.. జుట్టుంటేనే అందం, ఆనందం. కానీ ఈ రోజుల్లో అబ్బాయిలకే కాదు.. అమ్మాయిలు కూడా హెయిర్ ఫాల్ సమస్యను ఫేస్ చేస్తున్నారు. దీనికి తోడు డ్రై హెయిర్, డాండ్రఫ్ వంటి సమస్యలు కూడా వేధిస్తున్నాయి. వీటికోసం ఎన్ని నివారణా చర్యలు తీసుకున్నా.. జుట్టు మాత్రం ఒత్తుగా, బలంగా తయారవదు.
 

మీకు ఈ విషయం తెలుసా? మన జుట్టు ఏడాదికి సుమారు ఆరు అంగుళాల పొడవు పెరుగుతుందట. అంటే నెలకు అర అంగుళం వరకు పెరుగుతుందన్న మాట. అయితే జుట్టు పెరిగేది వయస్సుతో పాటు తగ్గుతుంది. అయితే కొన్ని జుట్టును వేగంగా పెంచడానికి సహాయపడతాయి. 
 

వెంట్రుకలు వేగంగా పెరగపోవడానికి ఎన్నో అడ్డంకులు ఉంటాయి. పోషకాహార లోపం, జన్యుపరంగా, హార్మోన్లలో హెచ్చు తగ్గులు జుట్టును పెరగకండా అడ్డుపడతాయి. అయితే జన్యుపరంగా కాకుండా మిగతా అడ్డంకులను వదిలించుకునే చిట్కాలు ఉన్నాయి. ప్రోటీన్లు, విటమిన్ బి, విటమిన్ సి, ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్లు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఒకవేళ ఇవి అందుబాటులో లేకపోకపోతే మీ వెంట్రుకలు పెరిగే అవకాశమే లేదు. 
 

ఇకపోతే కొన్ని రకాల మందులు బిల్లలు కూడా జుట్టు పెరుగుదలను అడ్డుకుంటాయి. ఆందోళన, నిరాశ, ఆకస్మికంగా బరువు తగ్గడం, వ్యాధులు వంటి మొదలైన కారణాల వల్ల కూడా జుట్టు పెరుగుదల ఆగిపోయి.. ఊడిపోతుంది. అందుకే కారణాలను గుర్తించి చికిత్స తీసుకోవాలి. అయితే మీ జుట్టు పెరగడానికి కాఫీ పౌడర్ కూడా ఉపయోగపడుతుంది. 

జుట్టును ఆరోగ్యంగా ఉంచే పదార్థాల్లో కాఫీ ఒకటి. ఇది జుట్టు వేగంగా పెరిగేందుకు సహాయపడుతుంది. అలాగే మాడును శుభ్రంగా కూడా ఉంచుతుంది. మాడు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మెరిసే జుట్టు మీ సొంతం అవుతుంది. జుట్టుకు కాఫీని ఉపయోగించాలంటే ప్రత్యేకంగా హెయిర్ మాస్క్ ను వేసుకోవచ్చు. కాఫీ  తో వివిధ రకాల హెయిర్ మాస్క్ లను ఉపయోగించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

కాఫీ, తేనె, ఆలివ్ ఆయిల్

 ఆలివ్ ఆయిల్, తేనె మాడును హైడ్రేట్ గా, తేమగా ఉంచుతాయి. తేనె నెత్తిమీద పెరిగే ఏ రకమైన ఫంగస్ లేదా బ్యాక్టీరియాను తొలగించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. కాఫీ ని ఈ పదార్థాలతో కలిపి జుట్టుకు మాస్క్ వేసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. 

కాఫీ పౌడర్, గుడ్డు పచ్చసొన

గుడ్లలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. దీనిని హెయిర్ మాస్క్ గా ఉపయోగించడం వల్ల దెబ్బతిన్న జుట్టు రిపేర్ అవుతుంది. దీనిలో ఐరన్, విటమిన్లు,  సోడియం, లెక్టిన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ జుట్టును రిపేర్ చేయడంలో సహాయపడతాయి.

కాఫీ, పెరుగు

ఈ రెండు పదార్థాలను ఉపయోగించే హెయిర్ మాస్క్ ను వాడితే అద్భుత ప్రయోజనాలను పొందుతారు. పెరుగు మీ జుట్టును మృదువుగా చేయడానికి సహాయపడుతుంది, కాఫీ పౌడర్ మీ జుట్టును బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి పని చేస్తుంది. 

కాఫీ, కొబ్బరి నూనె

ఈ మాస్క్ మీ చర్మానికే కాదు.. జుట్టుకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. కొబ్బరి నూనె జుట్టును తేమగా ఉంచడానికి సహాయపడుతుంది. కాఫీ మాడును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
 

click me!