చలికాలంలో గుండె జబ్బులు రాకూడంటే వీటిని మరువకుండా తినండి

First Published Dec 27, 2022, 2:47 PM IST

ఓట్ మీల్ లో మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయి. దీనిలో రోగనిరోధక శక్తిని పెంచే, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే జింక్, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 
 

గుండె కొట్టుకోకుండా క్షణ కాలం కూడా బతకలేం. మనం నిండు నూరేళ్లు ఆరోగ్యంగా బతకాలంటే గుండె  ఆరోగ్యం బాగుండాలి. గుండె మన శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని శుద్ధి చేసి పంప్ చేసే అవయవం. అనారోగ్యకరమైన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల తరచుగా గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారపు అలవాట్లను ఫాలో అయితే మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ముందే ఇది చలికాలం. ఈ సీజన్ లో  గుండెపోటు, స్ట్రోక్ వంటి గుండెకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే ఈ కాలంలో కొన్ని రకాల ఆహారాలను తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

సిట్రస్ పండ్లు

గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల లీస్ట్ లో సిట్రస్ పండ్లు ఫస్ట్ ప్లేస్ లో ఉంటాయి. ఈ సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది. అందుకే ఈ సీజన్ లో నారింజ, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లను ఎక్కువగా తినండి. ఈ పండ్లు యాంటీ ఆక్సిడెంట్లు,  ఫైబర్ కు మంచి మూలం. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె సమస్యలు రాకుండా కాపాడుతాయి. 

berries

బెర్రీలు

స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీ వంటి రకరకాల బెర్రీలను చలికాలంలో ఖచ్చితంగా తినాలి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి, ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండే ఈ బెర్రీలు గుండె ఆరోగ్యానికి చాలా చాలా మంచివి. ఇవి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి.

బచ్చలికూర

దీనిని కాలాలతో సంబంధం లేకుండా తినొచ్చు. ఏ కాలంలో తిన్నా దీని నుంచి పొందే ప్రయోజనాలు మాత్రం తగ్గవు. దీని ద్వారా మన శరీరానికి అవసరమైన పోషకాలను పొందుతాము. ఈ ఆకు కూరలో విటమిన్ ఎ,  విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. బచ్చలికూరలో ఐరన్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ సమృద్ధిగా ఉన్న బచ్చలికూర డయాబెటిస్ పేషెంట్లకు హెల్తీ ఫుడ్. బచ్చలికూరను మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీ గుండె  ఆరోగ్యంగా ఉంటుంది. 
 

ఓట్ మీల్

ఓట్ మీల్ కూడా గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. దీనిలో మన ఆరోగ్యానికి కాపాడే రకరకాల పోషకాలు ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే దీనిలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే జింక్, ఫైబర్ వంటి పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.
 

గింజలు

గింజల ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటిలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఈ పోషకం మన మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గింజలు కూడా బరువును నియంత్రించడానికి సహాయపడతాయి. ఇవి గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.

click me!