మృనాల్ ఠాకూర్ ... ప్రస్తుతం ఈ పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందరికీ సుపరిచితమే. సీతారామం సినిమాతో ఆమె నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఆ సినిమాలో ఆమె అందానికీ, నటనకు అందరూ మంత్రముగ్దులైపోయారు. ఆ సినిమాలో సీత పాత్రకు.. మృనాల్ తప్ప మరెవ్వరూ న్యాయం చేయలేరు అన్నంతగా.. ఆమె ఆ పాత్రలో ఒదిగిపోయారు. అందుకే.. సర్వత్రా ఆమెపై ప్రశంసల వర్షం కురిసింది. సినిమా వచ్చి నెలలు గడుస్తున్నా... ఆమె అందం నుంచి కుర్రకారు ఇంకా తేరుకోలేదనే చెప్పాలి.