ఆడవారు కండోమ్ లను ఉపయోగించడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఇవే..!

First Published Dec 27, 2022, 1:43 PM IST

మగవాళ్లకే కాదు.. ఆడవాళ్లకు కూడా కండోమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆడవాళ్లు ఈ గర్భనిరోధక  పద్దతిని ఉపయోగించడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందుతారు.. అంతేకాదు.. 
 

పురుషులు కండోమ్ లను వాడటం వల్ల పొందే ప్రయోజనాలు దాదాపుగా అందరికే తెలుసు. కానీ ఆడవాళ్లు ఉపయోగించే కండోమ్ ల విషయంలో మాత్రం ఎన్నో అనుమానాలు, అపోహలు ఉన్నాయి. అందుకే చాలా మంది వీటిని వాడటానికి వెనకాడుతుంటారు. అంతర్గత కండోమ్స్ అని కూడా పిలువబడే ఆడ కండోమ్ లు అవాంఛిత గర్భధారణను నివారిస్తాయి. ఇవి మగ కండోమ్ ల మాదిరిగానే ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉంటాయి.
 

మగవాళ్ల కండోమ్ లను బాహ్య కండోమ్ లు అంటారు. అంతర్గత, బాహ్య కండోమ్ లు రెండూ వీర్యకణాలు అండంలోనికి ప్రవేశించకుండా నిరోధిస్తాయి. దీంతో గర్బందాల్చే అవకాశం తగ్గుతుంది. అంతేకాదుహెచ్ఐవి / ఎయిడ్స్, వైరల్ హెపటైటిస్ వంటి లైంగికంగా సంక్రమించే అంటువ్యాధుల (ఎస్టిఐ) నుంచి కూడా ఇవి రక్షణిస్తాయి. ఈ ఆడ కండోమ్ లు లేదా అంతర్గత కండోమ్ ల వల్ల ప్రయోజనాలతో పాటుగా కొన్ని దుష్ఫ్రభావాలు కూడా ఉన్నాయి. 

ఆడ కండోమ్ లు ఎంత ప్రభావవంతంగా ఉంటాయి?

ఈ కండోమ్ ల ప్రభావం గురించి చాలా మంది ఆడవారికి ఎన్నో అనుమానాలు ఉన్నాయి. కొంతమంది ఈ కండోమ్ లు వారి యోని  ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయనుకుంటారు. ఇలాంటి రక్షణ ఉత్పత్తులను ఉపయోగించడానికి వెనకాడటానికి ఇది మెయిన్ రీజన్. దీనిని సరిగ్గా ధరించి, వీటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే.. అవాంఛిత గర్భధారణను నివారించడానికి అవి చాలా ప్రభావవంతంగా ఉంటాయి. దీన్ని మీరు సరిగ్గా ఉపయోగిస్తే 95 శాతం ప్రభావవంతంగా  పనిచేస్తాయంటున్నారు నిపుణులు. 
 

అంతర్గత కండోమ్ ల ప్రయోజనాలు

వీటిని ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ స్టోర్ లో కొనొచ్చు. 

ప్రెగ్నెన్సీ సమయంలో, డెలివరీ సమయంలో,  పీరియడ్స్ సమయంలో కూడా వీటిని ఉపయోగించి సురక్షితంగా ఉండొచ్చు.

అవాంఛిత గర్భధారణను నివారించడానికి ఈ అంతర్గత కండోమ్ లు ప్రభావవంతంగా పనిచేస్తాయి.

ఎస్ టిఐలను నివారించడానికి కూడా ఇవి ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. 
 

ఇవి రబ్బరతో తయారుచేయబడవు. ఇది సాపేక్షంగా మృదువైన పదార్థం. నైట్రైల్ ను వీటి తయారీలో ఉపయోగిస్తారు. ఇది మీ చర్మానికి చిరాకును కానీ, అలెర్జీని కానీ కలిగించదు.

సెక్స్ లో పాల్గొనడానికి 8 గంటల ముందు ఈ కండోమ్స్ ధరించాలి. సమయం వచ్చినప్పుడు మీరు వీటిని ధరించడానికి తొందరపడాల్సిన అవసరం లేదు.

ఆడవారు ధరించే కండోమ్ లు మగవాళ్లు ధరించే కండోమ్ ల కంటే ఎక్కువ రోజులు ఉంటాయి. అవి ఎండ లేదా తేమ నుంచి దెబ్బతినకుండా 5 సంవత్సరాల వరకు ఉంటాయి.

ఆడవారు ధరించే కండోమ్స ల వల్ల ఎలాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావు. ఇది ఉపయోగించడానికి చాలా సురక్షితమైంది.
 

ఆడవారు ధరించే  కండోమ్ ల ప్రతికూలతలు

ఇవి పురుషులు ధరించే కండోమ్ ల కంటే ఎక్కువ ఖరీదైనవి. 

ఆడ కండోమ్ లు ధరించడం వల్ల కొద్దిగా అసౌకర్యంగా ఉంటుంది. అందరూ వీటిని ఉపయోగించకపోవచ్చు. 

అవి మగ కండోమ్ల లాగే అంత సులువుగా లభించవు. 

ఇది పురుషాంగం యోనిని తాకకుండా నిరోధిస్తుంది. ఇది క్లిటోరల్ ఉద్దీపన అవకాశాన్ని తగ్గిస్తుంది. దీంతో శృంగారాన్నిఅంతగా ఆనందించలేరు.
 
ఆడ కండోమ్ లు మీడియం, పెద్ద సైజుల్లో మాత్రమే లభిస్తాయి. అయితే మన దేశంలో ఒక సైజు మాత్రమే అందుబాటులో ఉంది.

వీటిలో స్పెర్మిసిడికల్ జెల్ ఉండదు.

ఆడ కండోమ్ లను కడిగి తిరిగి ఉపయోగించొచ్చు. కానీ వీటిని కొత్తవాటినే ఉపయోగించాలని నిపుణులు సలహానిస్తున్నారు. 

click me!