చలికాలంలో గుండెపోటు రాకూడదంటే.. ఈ ప్రత్యేక కూరగాయను తప్పకుండా తినండి

First Published Dec 24, 2022, 12:00 PM IST

ఈ రోజుల్లో గుండెపోటు సర్వ సాధరణ వ్యాధిగా మారిపోయింది. చిన్న పిల్లలు, యువత కూడా గుండెపోటు బారిన పడుతున్నారు. ముఖ్యంగా చలికాలంలో గుండెపోటు ఎక్కువగా వస్తుంది. అయితే కొన్ని ప్రత్యేక కూరగాయలను తింటే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం తగ్గుతుంది. 

చలికాలంలో లభించే పండ్లు, కూరగాయలను తప్పకుండా తినండి. వాటిలో కాలీఫ్లవర్ ఒకటి. కాలీఫ్లవర్ లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీనిని శీతాకాలంలో తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు చెబుతున్నారు. దీనిని ఎక్కువగా పరాఠాలు, కూరగాయలు, ఊరగాయల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఈ కూరగాయ రుచికి అద్బుతంగా ఉంటుంది. అంతేకాదు జీర్ణక్రియకు మంచిది. అయితే  ఈ కూరగాయను కొంతమంది అస్సలు తినకూడదు. లేకపోతే వీరి ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. వాళ్లు ఎవరెవరంటే.. 
 

యూరిక్ యాసిడ్ పెరుగుతుంది

నిజానికి కాలీఫ్లవర్ లో ప్రోటీన్, కార్భోహైడ్రేట్లు, కాల్షియం, పొటాషియం, భాస్వరం, అయోడిన్, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి లు పుష్కలంగా ఉంటాయి. వైద్య ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవాళ్లు కాలీఫ్లవర్ కూరగాయలను, పరాఠాలను అస్సలు తినకూడదు. ఎందుకంటే వీటిని తింటే గ్యాస్ట్రిక్, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. 
 

థైరాయిడ్ లెవెల్స్ పెరుగుతాయి

గర్భిణీ స్త్రీలు కూడా కాలిఫ్లవర్ ను అసలే తినకూడదు. ఎందుకంటే దీన్ని తినడం వల్ల గర్భంలో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. బిడ్డ ఎదుగుదల బాగుండదు. అలాగే థైరాయిడ్ తో బాధపడేవారు కూడా కాలీఫ్లవర్ ను తినకూడదు. థైరాయిడ్ పేషెంట్లు కాలిఫ్లవర్ ను తింటే  థైరాయిడ్ సమస్య మరింత పెరుగుతుంది. 
 

ఎవరెవరు కాలీఫ్లవర్ ను తినాలంటే..

ఊబకాయులు, బరువు పెరిగే సమస్య ఉన్న వాళ్లు కాలీఫ్లవర్ ను ఎక్కువగా తినాలి. ఎందుకంటే దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. ఇది ఆకలిని నియంత్రిస్తుంది. మీరు వేగంగా బరువు తగ్గేందుకు ఎంతో సహాయపడుతుంది. దీన్ని రెగ్యులర్ గా తింటే ఫాస్ట్ గా బరువు పెరుగుతారు. 
 

గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ఈ కాలీఫ్లవర్ ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే దీనిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. ఇది గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే గుండెను ఆరోగ్యం ఉంచుతుంది.  

click me!