జాన్వీ కపూర్..... పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. శ్రీదేవి తనయగా....ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జాన్వీ.... తన అందం, అభినయంతో... ఆకట్టుకుంటోంది. త్వరలోనే తెలుగు తెరపై కూడా జాన్వీ మెరిసే అవకాశం ఉంది. ఆమెను తెలుగు తెరపైకి తీసుకువచ్చేందుకు దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సంగతి పక్కన పెడితే.... సినిమాల్లోకి రాకముందు జాన్వీకపూర్... కొంచెం బొద్దుగా ఉండేది. కానీ.... సినిమాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్న తర్వాత... ఫిట్నెస్ పై దృష్టి పెట్టి... సన్నజాజి తీగల మారిపోయింది. కాగా.... ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఫిట్నెస్ సీక్రెట్ ని జాన్వీ వివరించింది.