కరోనా కేసులు పెరుగుతున్నయ్.. రోగనిరోధక శక్తి పెరగాలంటే ఇలా చేయండి.. సేఫ్ గా ఉంటారు

First Published Dec 24, 2022, 11:02 AM IST

చైనాలో ఇప్పటికే కరోనా కేసులు దారుణంగా పెరిగిపోతున్నయ్. దీంతో ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తం అయ్యాయి. ఈ కరోనా మన దేశాన్ని పూర్తిగా విడిచిపోలేదు. మన దేశంలో కూడా కరోనా వ్యాపిస్తోంది. దీనినుంచి సురక్షితంగా ఉండాలంటే మాత్రం ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవాల్సిందేనంటున్నారు డాక్టర్లు, నిపుణులు. 
 

చైనాలో బీఎఫ్.7 అనే ఓమిక్రాన్ సబ్ వేరియంట్ ద్వారా కోవిడ్-19 వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. అయితే ఇప్పటివరకు మన దేశంలో 4 బిఎఫ్ .7 కేసులు నిర్ధారించబడ్డాయి. వీరు హోం ఐసోలేషన్ లో ఉన్నారు. అయితే వీరు హాస్పటల్ కు వెళ్లకుండానే కోలుకుంటారట. ఈ వేరియంట్ చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతున్నందుకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సలహానిస్తోంది.

ఈ కొత్త కోవిడ్ ను ఎదుర్కోవడానికి ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. అలాగే సామాజిక దూరం పాటించాలి. క్రమం తప్పకుండా సబ్బు, నీటితో చేతులను బాగా కడుక్కోవాలి. అలాగే బూస్టర్ డోస్ ను ఖచ్చితంగా తీసుకోవాలి. ముఖ్యంగా కోవిడ్ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 
 

covid 19

అయితే శరీర రోగనిరోధక శక్తిని పెంచడం వల్ల కోవిడ్ బారిన పడకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు. మంచి పోషకాహారం తినడం, శారీరకంగా చురుకుగా ఉండటం, శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడం, కంటి నిండా నిద్రపోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది వ్యాధిని బాగా ఎదుర్కోవడానికి సహాయపడుతుంది.

రోగనిరోధక వ్యవస్థ అనేది కణాలు, కణజాలాలు, అవయవాలకు చాలా చాలా అవసరం. ఇవి మన శరీరాన్ని అంటువ్యాధులు, ఇతర వ్యాధుల నుంచి రక్షించడానికి కలిసి పనిచేస్తాయి. ఈ రోగనిరోధక శక్తి అతని  లేదా ఆమె  వయస్సు, లింగం, శారీరక శ్రమ స్థాయి, ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం, జీవనశైలి, ఆహారంపై ఆధారపడి ఉంటుంది. బలమైన, ఆరోగ్యకరమైన రోగనిరోధక శక్తిని పొందడానికి మనం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

covid 19

టీకాలు

టీకాలు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ టీకాలు వ్యాధుల బారిన పడకుండా మనల్ని కాడుతాయి. రోగనిరోధక వ్యవస్థ సంక్రమణ ద్వారా కాకుండా టీకా ద్వారా హానికరమైన సూక్ష్మక్రిములను తరమికొట్టడం చాలా సురక్షితం. 
 

fruits and vegetables

కూరగాయలను ఎక్కువగా తినండి

ఎక్కువ ఉప్పు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్స్ ను తినడం మానుకోండి. ప్రతిరోజూ 3 రకాల కూరగాయలు, 2 రకాల పండ్లను తినండి. మీ ప్లేట్ లో సగం పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోండి. చిక్కుళ్ళు, గుడ్లు, మాంసం, గింజలు వంటి ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినండి. 
 

విటమిన్లు

మెరుగైన రోగనిరోధక శక్తి కోసం మన శరీరానికి ఇనుము, జింక్, సెలీనియం, రాగి వంటి ఖనిజాలు అవసరమని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటితో పాటుగా విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ, ఫైటోన్యూట్రియెంట్స్, అమైనో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలను కూడా తీసుకోవాలి. 
 

శారీరక శ్రమ

శారీరక శ్రమ మనల్ని హెల్తీగా ఉంచుతుంది. అలాగే కండరాలను నిర్మిస్తుంది. ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడే సానుకూల హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఆరోగ్యంగా ఉండటానికి, ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడటానికి శారీరక శ్రమ చాలా చాలా అవసరం. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. అలాగే ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. హృదయనాళ సంబంధ వ్యాధులను నయం చేస్తుంది. ఎముకలను బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది.

పుష్కలంగా నీటిని తాగాలి

రోజూ పుష్కలంగా నీటిని తాగండి. మీ శరీరం డీహైడ్రేషన్ బారిన పడలేదని నిర్ధారించుకోవడానికి మూత్రం రంగును చూడండి. మూత్రం రంగు ముదురు పసుపు పచ్చగా ఉంటే మీరు నీటిని సరిగ్గా తాగడం లేదని అర్థం. నీరు రోగనిరోధక శక్తిని పెంచదు. కానీ  ఇది మీ శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడానికి, టాక్సిన్స్ పేరుకుపోకుండాచూస్తుంది.  ట్యాక్సిన్స్ వల్ల కలిగే వ్యాధులను నివారించడానికి కూడా సహాయపడుతుంది.

hand washing

చేతులను కడుక్కోవడం

కరోనా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి చేతుల పరిశుభ్రత బాగా పెరిగింది. నిజానికి మనం ఎన్నో వస్తువులను ముట్టుకుంటాం. వాటికి రకరకాల సూక్ష్మ క్రిములు, వైరస్ లు ఉండే అవకాశం ఉంది. అంటు వ్యాధుల వ్యాప్తిని నివారించడానికి సబ్బు, నీటితో మీ చేతులను తరచుగా బాగా కడుక్కోవాలి. 

click me!