చలికాలంలో హైడ్రేట్ గా ఉండటానికి ఆరోగ్యకరమైన పానీయాలు..

First Published Jan 19, 2023, 11:56 AM IST

చలికాలంలో చాలా మంది నీళ్లను అస్సలు తాగరు. దీనివల్ల బాడీ డీహైడ్రేషన్ బారిన పడుతుంది. అయితే ఈ సీజన్ లో కొన్ని పానీయాలను తాగితే రోజంతా మీరు శక్తివంతంగా, చురుకుగా ఉంటారు. 
 

చలికాంలో చర్మం పొడిగా, నీరసంగా ఉంటుంది. నిజానికి చర్మం తాజాగా, తేమగా, కాంతివంతంగా ఉండటానికి నీరు చాలా అవసరం. కానీ చలికాలంలో తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా నీటిని సరిపడా తాగరు. ఫలితంగా బాడీ డీహైడ్రేషన్ బారిన పడుతుంది. ఈ నిర్జలీకరణం వల్ల జీవక్రియ తగ్గుతుంది. అలాగే నీరసంగా ఉంటుంది. తలనొప్పి, అలసట వంటి సమస్యలు కూడా వస్తాయి. అందుకే రోజుకు సరిపడా నీటిని ఖచ్చితంగా తాగాలంటారు ఆరోగ్య నిపుణులు. అయినప్పటికీ.. చల్లని చలికి నీటిని తాగడం కష్టంగా అనిపిస్తుంది. అయితే మీరు హైడ్రేట్ గా ఉండటానికి ఈ ఆరోగ్యకరమైన పానీయాలను తాగండి. 
 

హెర్బల్ టీ

హెర్బల్ టీ లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇది ఆరోగ్యకరమైన టీ కూడాను. ఈ టీని తాగితే మీ శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇది సాధారణంగా టీ.. మొక్కల ఆకులు లేదా ఆకు మొగ్గలను కలిగి ఉండదు. నీటిలో ఎండిన పండ్లు, పువ్వులు, సుగంధ ద్రవ్యాలు లేదా మూలికల మిశ్రమాలు ఉంటాయి. ఈ టీలో 98 శాతం నీరు, రెండు శాతం కెఫిన్ కంటెంట్ ఉంటుంది. ఇది సౌకర్యవంతంగా,  వెచ్చగా ఉన్నప్పుడు రీహైడ్రేట్ చేయడానికి అద్భుతమైన పద్ధతి. మందార, గులాబీ, చమోమిలే టీలు అద్భుతమైన కెఫిన్ లేని ప్రత్యామ్నాయాలు.
 

సూప్ లు 

చలిలో వేడివేడి సూప్ లు తాగడం వల్ల బాడీ రిలాక్స్ అవుతుంది. కూరగాయలను నీటిలో ఉడికించడం వీటిని తయారుచేస్తారు. బంగాళాదుంపలు, క్యారెట్లు, టర్నిప్స్, బఠానీలు, టమోటాలు, ఇతర కూరగాయలను ఉపయోగించి మిశ్రమ కూరగాయల సూప్ లను తయారు చేయొచ్చు. హైడ్రేట్ గా ఉండటానికి మీరు బచ్చలికూర సూప్ లను కూడా తయారు చేయొచ్చు. మీ సూప్ లో పుట్టగొడుగులను కూడా చేర్చొచ్చు. ఎందుకంటే అవి జీర్ణక్రియకు సహాయపడతాయి. 

green juices

ఆకుపచ్చ రసాలు

లంచ్ తర్వాత గ్రీన్ జ్యూస్ లను తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిని వివిధ రకాలుగా తయారు చేసుకోవచ్చు. గ్రీన్ జ్యూస్ మీ రోజువారీ కూరగాయలను మోతాదులో పొందడానికి అద్భుతమైన పద్ధతి. ఎందుకంటే ఈ గ్రీన్ జ్యూస్ లల్లో విటమిన్ కె, విటమిన్ సి లతో పాటుగా ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ జ్యూస్ లు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే కూరగాయలను జ్యూస్ చేస్తే వాటిలో ఫైబర్ కంటెంట్ ఉండదు. అందుకే తగినంత డైటరీ ఫైబర్ ను వేరే పద్దతుల్లో తీసుకోండి. 

ఆకుపచ్చ రసాలు మీ రోజువారీ ద్రవ అవసరాలను తీర్చడానికి సహాయపడతాయి. సీజనల్ వెజిటేబుల్స్ తో గ్రీన్ జ్యూస్ ను తయారుచేసుకుని తాగడం మంచిది. చలికాలంలో గ్రీన్ జ్యూస్ ను చల్లగా చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ  అలా చేస్తే జలుబు చేస్తుంది. 
 

పసుపు పాలు

నిద్రపోయే ముందు పసుపు పాలను తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుంది. ఈ పసుపు మన శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. దీంతో రాత్రిళ్లు హాయిగా నిద్రపడుతుంది. ఇది యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది.  వైరల్ వ్యాధుల బారిన పడేవారికి పసుపు పాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఇది మొత్తం రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతో సహాయపడుతుంది. నిజానికి చలికాలంలో ఎక్కువ తినాలనే కోరిక పుడుతుంది. కేలరీలు అధికంగా ఉండే  ఆహారాలనే తినాలనిపిస్తుంది. దీంతో మీరు అతిగా తినే అవకాశం ఉంది. ఇది గ్యాస్, ఉబ్బరం, అజీర్థి వంటి సమస్యలకు దారితీస్తుంది. అయతే పసుపు పాలను తాగితే ఈ సమస్యలొచ్చే ప్రమాదం తగ్గుతుంది. 
 

నిమ్మకాయ నీరు

గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసం పిండి అందులో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ పానీయం కూడా మన శరీరాల్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. దీనిలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. నిమ్మకాయ నీరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. నిమ్మకాయ నీరు పొటాషియానికి మంచి వనరు. ఇది సోడియం స్థాయిలను నియంత్రించడానికి  సహాయపడే  అద్భుతమైన ఖనిజం. ఉప్పు వల్ల వచ్చే ఉబ్బరం తగ్గించడానికి ఇది బాగా సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. ఈ నీరు ఆకలిని కూడా కంట్రోల్ చేస్తుంది. 

click me!