ముఖంపై నల్ల మచ్చలు ఎంతకీ పోవడం లేదా? ఇలా చేసి చూడండి తొందరగా తొలగిపోతాయి..

First Published Jan 19, 2023, 10:49 AM IST

ముఖంపై నల్లని మచ్చలు అందాన్ని పూర్తిగా తగ్గిస్తాయి. కొంతమంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా పోవు. కానీ కొన్ని చిట్కాలతో ఈ మచ్చలను సులువుగా తొలగించొచ్చు. 
 

మీ చర్మంపై తెల్లని, నల్లని మచ్చలు ఉండటం చాలా సహజం. ఈ మచ్చలు అందాన్ని తగ్గిస్తాయి. మచ్చలు లేని చర్మాన్ని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు కానీ.. అవి రాకుండా ఉండటం, వాటిని పోగొట్టడం అంత సులువైన విషయం కాదు. వృద్ధాప్యం, ఇతర రోజువారీ చర్మ సమస్యల వల్ల నల్ల మచ్చలు లేదా హైపర్పిగ్మెంటేషన్ సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు మొటిమలు వల్ల కూడా మొండి నల్ల మచ్చలు ఏర్పడతాయి. అయితే ఈ డార్క్ స్పాట్ ను కొన్ని సింపుల్ చిట్కాలతో వదిలించుకోవచ్చు. 
 

నల్ల మచ్చలకు చికిత్స

ముఖంపై ఉన్న నల్ల మచ్చలు లేదా ఇతర మచ్చలు పూర్తిగా పోవడానికి చాలా సమయం పడుతుంది. అయినప్పటికీ నల్ల మచ్చలను వదిలించుకోవడానికి కొన్ని సింపుల్ చిట్కాలు బాగా ఉపయోగపడతాయి. దీనికంటే ముందు మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఎప్పుడూ చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించాలి. అయితే చికిత్స వ్యక్తికి వ్యక్తికి భిన్నంగా ఉంటుంది. కానీ నల్ల మచ్చలను  కొన్ని సింపుల్ చిట్కాలతో వదిలించుకోవచ్చు. అవేంటంటే..
 

విటమిన్ సి

చర్మంపై నల్లటి మచ్చలను వదిలించుకోవడానికి విటమిన్ సి ఒక అద్భుతమైన పదార్ధం. విటమిన్ సితో నిండిన సీరమ్స్ లేదా క్రీములు ముఖంపై నల్ల మచ్చలు , హైపర్పిగ్మెంటేషన్ కు చికిత్స చేయడంలో ప్రభావవంతంగా ఉంటాయి. ఇది మెలనిన్ ఉత్పత్తి మొత్తాన్ని తగ్గిస్తుంది. దీంతో మీ చర్మం కాంతివంతంగా, అందంగా మారుతుంది. చర్మంలో మెలనిన్ ఎక్కువగా ఉంటే నల్ల మచ్చలకు దారితీస్తుంది. విటమిన్ సి లో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు సూర్యరశ్మి వల్ల దెబ్బతిన్న చర్మాన్ని, మొటిమల వల్ల కలిగే అన్ని రకాల నల్ల మచ్చలను తగ్గించడానికి సహాయపడతాయి. అందుకే మీరు వాడే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో విటమిన్ సి ఉండే సీరం లేదా క్రీమ్ ను వాడండి. సన్ స్క్రీన్ ను వాడండి. విటమిన్ సి మీ చర్మాన్ని ఫోటోసెన్సిటివ్ గా మార్చగలదు. అందుకే విటమిన్ సి ఉండే సన్స్క్రీన్ ను తప్పకుండా వాడండి. 
 

నియాసినమైడ్

నియాసినమైడ్ చర్మాన్ని కాంతివంతం చేసే అనేక పదార్థాలతో తయారవుతుంది. ఇవి నల్ల మచ్చలను తొలగించడానికి బాగా సహాయపడతాయి. నల్ల మచ్చలను తొలగించడానికి యాసినమైడ్-ఇన్ఫ్యూజ్డ్ సీరం లేదా క్రీమ్ ను వాడండి.. నియాసినమైడ్ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. చర్మంపై సెరామైడ్ల పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. ఇది చర్మాన్ని అందంగా మార్చుతుంది. అలాగే సూర్యరశ్మి వల్ల దెబ్బతిన్న చర్మాన్ని, హైపర్పిగ్మెంటేషన్ నుంచి రక్షిస్తుంది. అంతేకాదు ఇది చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. అయితే దీనిని వాడినప్పటి నుంచి 4 నుంచి6 వారాలలో తేడాను మీరే గమనిస్తారు. ఒకవేళ మీరు నియాసినమైడ్ ఉపయోగిస్తుంటే సన్స్క్రీన్ ను తప్పకుండా వాడండి. 

లైకోరైస్

నల్ల మచ్చలు లేదా పాలిపోయిన రంగు సమస్యలను వదిలించుకోవడానికి లైకోరైస్ బాగా ఉపయోగపడుతుంది. లైకోరైస్ సారం ను నల్ల మచ్చలను వదిలించుకోవడానికి ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. లిక్విరిటిన్ అని పిలువబడే లైకోరైస్ లోని సమ్మేళనం చర్మం నల్లబడటానికి కారణమయ్యే అదనపు మెలనిన్ ఉత్పత్తిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది నల్ల మచ్చలను తొలగించడానికి ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే హైపర్పిగ్మెంటేషన్ ను కూడా నివారిస్తుంది. లైకోరైస్ సారం స్కిన్ టోన్ ను మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. 

click me!