కాఫీలో కెఫిన్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడమే కాదు.. ఎన్నో గుండె సంబంధిత సమస్యలను కూడా పోగొడుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని ఎన్నో అధ్యనాలు నిరూపించాయి. నిజానికి కాఫీలో పొటాషియం, విటమిన్ ఇ, మెగ్నీషియం వంటి సూక్ష్మపోషకాలు కూడా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి.