ఈ జ్యూస్ లు ఎన్నో రోగాలను తగ్గిస్తాయి.. తప్పక తాగండి

First Published Dec 2, 2022, 2:55 PM IST

ఇంట్లో తయారుచేసిన జ్యూస్ లను తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుంది. రోజుకు ఒక పండు లేదా కూరగాయల రసాన్ని తాగితే థైరాయిడ్, డయాబెటీస్, హై బీపీ వంటి ఎన్నో రోగాలు నయమవుతాయి. 
 

ప్రస్తుత కాలంలో  అందరూ ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఆహారం విషయంలో. పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలనే తింటున్నారు. అయితే బయటదొరికే ఆహారాలే కాదు.. ఇంట్లో ఉండే పండ్లు, కూరగాయలతో రసం చేసుకుని తాగితే కూడా మీ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రమాదకరమైన రోగాల నుంచి మనల్ని రక్షించడానికి కొన్ని రకాల రసాలు ఎంతో సహాయపడతాయి.ఏ జ్యూస్ ఏ రకమైన వ్యాధులను తగ్గిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 

cold

జలుబు, దగ్గు

చలికాలంలో దగ్గు, జలుబు సమస్యలు రావడం చాలా కామన్. ఈ సమస్యలు తగ్గడానికి నారింజ, పసుపు, అల్లం, తేనె వేసిన రసం తాగాలి. దీన్ని తయారు చేయడానికి ముందుగా కొద్దిగా నారింజ రసాన్ని తీసుకోండి. దీనిలో పసుపు, అల్లం, తేనె వేసి కలిపి తాగండి. ఇది జలుబు, దగ్గును తగ్గించడంతో పాటుగా ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. 
 

thyroid

థైరాయిడ్

ప్రస్తుత కాలంలో చాలా మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. పిల్లల నుండి పెద్దల వరకు ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారు. క్యారెట్, పైనాపిల్, బీట్ రూట్ జ్యూస్ ను తాగితే సమస్య తగ్గిపోతుంది.  ఇందుకోసం ఒక క్యారెట్, సగం పైనాపిల్, సగం బీట్ రూట్ ను కట్ చేసి బాగా గ్రైండ్ చేయండి. దీనిలో కొద్దిగా నీళ్లు పోసి దాని జ్యూస్ గా తయారుచేయండి. రుచి కోసం మీరు దీనిలో తేనెను కలపొచ్చు. 
 

అధిక రక్తపోటు

పిల్లల నుంచి పెద్దల వరకు నేడు చాలా మంది హై బీపీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ హై బీపీ గుండెపోటు, స్ట్రోక్ వంటి ఎన్నో రోగాలకు దారితీస్తుంది. అందుకే దీన్ని తగ్గించుకోవాలి. అయితే ఈ సమస్య ఉన్న వాళ్లు ప్రతిరోజూ ఉదయం పరగడుపున సోంపు, కొత్తిమీర, నిమ్మరసం తాగాలి. ఇది రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. దీని కోసం ముందుగా కొన్ని కొత్తిమీర ఆకులు, దాని తాజా కాడలను మిక్సీలో వేడి గ్రైండ్ చేయండి. దీనిలో కొన్ని నీరు పోసి సోంపు పొడిని వేయండి. అలాగే ఒక నిమ్మకాయను పిండండి. దీనిని ప్రతిరోజూ ఉదయం పరిగడుపున తాగితే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
 

Anemia

రక్తహీనత 

శరీరంలో ఐరన్ లోపించడం వల్ల రక్తహీనత సమస్య వస్తుంది. ఇలాంటి వారికి ఈ జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం క్యారెట్, బీట్ రూట్, ఒక ఆపిల్ తొక్క తీసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. దానిని ఫిల్టర్ చేసి.. రసాన్ని తీసి తాగండి. ఇది మీ శరీరంలో రక్తాన్ని పెంచుతుంది. 
 

diabetes

డయాబెటిస్

ప్రపంచ వ్యాప్తంగా డయాబెటీస్ రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రించడానికి ఒక జ్యూస్ మీకు బాగా సహాయపడుతుంది. దీనికోసం సగం దోసకాయ, కొన్ని కొత్తిమీర ఆకులు, సగం ఆపిల్, సగం కాకరకాయను వేసి మిక్సీలో వేసి గ్రైండ్  చేయండి. దీనిని వడకట్టి కొన్ని నీరు కలపండి. దీనిలో సగం నిమ్మకాయను పిండండి. రుచి కోసం దీనిలో ఉప్పు, మిరియాలను కలపొచ్చు. 
 

click me!