వీటిని వేడి చేసి తినడం అస్సలు మంచిది కాదు.. పొరపాటున తిన్నారో మీ పని అంతే..

First Published Dec 2, 2022, 1:58 PM IST

చాలా మందికి ఫుడ్ ను వేడిచేసుకుని తినే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో చాలా మంది అన్ని రకాల వంటలను వేడి చేసే తింటారు. కానీ వండిన వాటిని మళ్లీ వేడి చేసి తింటే ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 

కొంతమంది చలికాలంలో వేడి వేడి ఫుడ్స్ ను తినడానికే ఇష్టపడతారు. అలా అని ఎప్పటికప్పుడు వండుకుని తినరు. పొద్దున్న వండిన వాటిని ఓవెన్ లో పెట్టి తింటుంటారు. దీనికంటే ఏపూటకు ఆపూట వండుకుని తినడమే మంచిదంటున్నారు నిపుణులు. కానీ వండిన ఆహారాలను పదే పదే వేడి చేసి తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. నిజానికి ఇలా వేడి చేయడం వల్ల ఆహారంలోని పోషకాలన్నీ పోతాయి. దీంతో పాటుగా ఈ ఫుడ్ లో హానికరమైన బ్యాక్టీరియా సంఖ్య పెరుగుతుంది. దీంతో ఆహారం విషపూరితంగా మారుతుంది. మైక్రోవేవ్ లో ఫుడ్ ను వేడి చేయడం అస్సలు మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేసి తింటే కడుపులో గ్యాస్, కలుపు కలత, ఫుడ్ పాయిజనింగ్, ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధులు వస్తాయని చెబుతున్నారు. ఇంతకీ ఎలాంటి ఫుడ్సు ను  వేడిచేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. 

గుడ్లు

ఆమ్లెట్ లేదా గుడ్డు కూరలు చల్లగా అయితే.. వీటిని చాలా మంది ఒకటి రెండు నిమిషాలు ఓవెన్ లో వేడి చేస్తుంటారు. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం.. గుడ్లను వండిన తర్వాత మళ్లీ వేడి చేయడం చాలా ప్రమాదకరం. ఇలా వేడి చేస్తే సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా వాటిపై పెరుగుతుంది. దీన్ని తింటే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది. 
 

బంగాళాదుంప కూర

బంగాళాదుంప కూరను తిరిగి వేడి చేసి తినడం  ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే దీనివల్ల బంగాళాదుంపల్లో బ్యాక్టీరియం సి. బోటులినమ్ బాగా పెరుగుతుంది. ఇది ఫుడ్ పాయిజన్ కు కారణమవుతుంది. 

కోడికూర

చాలా మంది రాత్రి మిగిలిపోయిన చికెన్ ను పొద్దున్న వేడి చేసి తింటుంటారు. కానీ ఇలా మిగిలిపోయిన చికెన్ ను తినడానికి బదులుగా పారేయడమే మంచిది. కానీ చాలా మంది దీన్ని ఓవెన్ లో వేడి చేసి తింటుంటారు. దీనివల్ల చెకెన్ లో ఉండే ప్రోటీన్ విషతుల్యంగా మారుతుంది. దీనివల్ల కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. 
 

అన్నం

అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అందుకే చాలా మంది అన్నాన్ని అస్సలు పారేయరు. కానీ మిగిలిన అన్నాన్ని ఓవెన్ లో పెట్టి వేడిచేసుకుని తింటుంటారు. కానీ అన్నాన్ని వేడి చేసి తినడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే అన్నాన్ని వేడి చేయడం వల్ల వ్యాధికారక బ్యాక్టీరియా పెరుగుతుంది. ముఖ్యంగా ఫ్రిజ్ లో పెట్టి నేరుగా మైక్రోవేవ్ లో అస్సలు పెట్టకూడదు. 
 

సీఫుడ్

సీఫుడ్ ను చల్లగా తినడమే మంచిది. దీన్ని తయారుచేసి రెండు గంటలకు పైగా బయటే ఉంచితే అందులో బ్యాక్టీరియా పెరిగిపోతుంది. కాబట్టి తయారు చేసి తిన్న తరువాత.. మిగిలిన సీఫుడ్ ను ఫ్రిజ్ లో ఉంచండి. కానీ దీనిని తిరిగి వేడి చేయకూడదు. ఎందుకంటే దీనిలో బ్యాక్టీరియా చనిపోదు. ఇది కడుపుకు హాని కలిగిస్తుంది. 

click me!