ఈ వ్యాధులున్న వాళ్లు ఉసిరికాయను అసలే తినకూడదు..

First Published Dec 2, 2022, 12:53 PM IST

నిజానికి ఉసిరికాయలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. కానీ కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మాత్రం ఉసిరికాయలను మర్చిపోయి కూడా తినకూడదు. ఎందుకంటే.. 
 

ఉసిరి మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. దీనిలో విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్, ఐరన్, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఉసిరిని రోజూ తినడం వల్ల కళ్లు బాగా కనిపిస్తాయి. కంటి సమస్యలు తొలగిపోతాయి. అలాగే ఇది హెయిర్ ఫాల్ ను కూడా తగ్గిస్తుంది. ఉసిరిని తీసుకోవడం వల్ల జుట్టు బలంగా ఉంటుంది. అలాగే నల్లగా పెరుగుతుంది. అందుకే ఉసిరిని హెయిర్ ప్రొడక్ట్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. 
 

ఉసిరిలో న్యూట్రియెంట్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి.  ఇవి చర్మంపై చనిపోయిన కణాలను కణాలను తొలగిస్తాయి. అలాగే కొత్త కణాలు ఏర్పడటానికి సహాయపడతాయి. ఉసిరికాయ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖం కాంతివంతంగా తయారవుతుంది. నల్లని మచ్చలు తొలగిపోతాయి. ముడతలు తగ్గిపోతాయి. చర్మం యవ్వనంగా ఉంటుంది. 
 

ఉసిరిలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతో సహాయపడుతుంది. ఉసిరికాయలు మలబద్దకం సమస్యను కూడా తగ్గిస్తాయి. అలాగే కాలెయంలో విషపదార్థాలను బయటకుపంపుతాయి. రోజూ గ్లాస్ ఉసిరి జ్యూస్ ను తాగడం వల్ల  కామెర్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఉసిరి వల్ల ఒక్కటేమిటీ ఎన్నోఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కానీ వీటిని కొన్ని అనారోగ్య సమస్యలున్న వారు తినకూడదు. వాళ్లు ఎవరెవరంటే.. 

జలుబుతో బాధపడేవారు

చలికాలంలో చాలా మంది జలుబుతో ఇబ్బంది పడుతుంటారు. ఇకపోతే ఉసిరిలో చలువ చేసే గుణముంటుంది. దీన్ని తింటే జలుబు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. అందుకే జలుబు, జ్వరం తో బాధపడేవారు ఉసిరి కాయను తినకపోవడమే మంచిది. అనారోగ్యంతో ఉండి కూడా దీన్ని తింటే మీ శరీర ఉష్ణోగ్రత మరింత తగ్గే అవకాశం ఉంది. దీన్ని తింటే ఆసుపత్రి పాలు కాకతప్పదు. 
 

రక్తంలో తక్కువ చక్కెర సమస్య

యాంటీ బయోటిక్ మందులు తీసుకునే వాళ్లు కూడా ఉసిరికాయను తినకూడదు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు మరీ తక్కువగా ఉండే వారు కూడా వీటిని తినకూడదు. ఒకవేళ తింటే మీ ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. ఉసిరికాయ మీ రక్తంలో చక్కెర స్థాయిలను మరింత తగ్గిస్తుంది. దీనివల్ల మీ ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. 

మూత్రపిండాల రోగులు

మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారు కూడా ఉసిరికాయలను అస్సలు తినకూడదు. ఎందుకంటే ఉసిరికాయను తింటే శరీరంలో సోడియం పరిమాణం పెరిగిపోతుంది. దీంతో మూత్రపిండాలకు ఫిల్టర్ చేయడం కష్టంగా మారుతుంది. ఇది చివరకు మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది. 

శస్త్రచికిత్స చేయించుకునే వాళ్లు
 
ఏదైనా రోగానికి శస్త్రచికిత్స చేయంచుకునే వాళ్లు 2 వారాల ముందు నుంచే ఉసిరికాయను తీసుకోవడం మానేయాలి. ఒకవేళ అలాగే తింటే మీ రక్తనాళాలు పగిలిపోతాయి. అలాగే రక్తస్రావం అయ్యే ప్రమాదం కూడా పెరుగుతుంది. అందుకే వీళ్లు తినకూడదు. 

లో బీపీ పేషెంట్లు

రక్తపోటు మరీ తక్కువగా ఉండేవారు కూడా ఉసిరికాయలను తినకూడదు. ఒకవేళ తిన్నా తక్కువ మొత్తంలోనే తినాలి. ఉసిరికాయలను మరీ ఎక్కువగా తింటే బీపీ బాగా తగ్గుతుంది. దీనివల్ల లేనిపోని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. 

click me!