ఈ వ్యాధుల వల్లే మూత్రం వాసన వస్తుంది.. తప్పకుండా చెక్ చేయించుకోండి

Published : Dec 12, 2022, 10:58 AM IST

మూత్రంలో చెడు వాసనకు కారణాలెన్నో ఉంటాయి. డయాబెటీస్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, ప్రోస్టాటిటిస్ వంటి రోగాల వల్ల కూడా మూత్రం వాసన వస్తుందని డాక్టర్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.   

PREV
16
ఈ వ్యాధుల వల్లే మూత్రం వాసన వస్తుంది.. తప్పకుండా చెక్ చేయించుకోండి

మూత్రం రంగు మారడానికి కారణాలున్నట్టే.. మూత్రం వాసన రావడానికి కూడా ఎన్నో కారణాలు ఉంటాయంటున్నారు డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు. నిజానికి మూత్రంలో వాసనను అంతతేలిగ్గా తీసుకోవడానికి లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ మూత్రంలో ఘాటైన చెడు వాసన ఎన్నో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యను సూచిస్తుంది. బాగా హైడ్రేట్ గా ఉన్న శరీరం సాధారణంగా దుర్వాసన కలిగిన మూత్రాన్ని ఉత్పత్తి చేయదు. వీరిలో చెడు వాసన తక్కువగా ఉంటుంది. మాయో క్లినిక్ ప్రకారం.. మీ మూత్రం అధికంగా సాంద్రీకృతమైతే.. అంటే తక్కువ నీటితో అధిక స్థాయిలో వ్యర్థ ఉత్పత్తులను కలిగి ఉంటే.. మీ మూత్రంలో బలమైన అమ్మోనియా వాసన ఉండొచ్చు.  కొన్ని రకాల ఆహారాలు, మందులు కూడా మూత్ర వాసనకు దారితీస్తాయి. అయినప్పటికీ వాసన వచ్చే మూత్రం కూడా ఆరోగ్య పరిస్థితులకు సంకేతం. అవేంటంటే..
 

26
diabetes

డయాబెటీస్

డయాబెటిస్ అనేది దీర్ఘకాలిక పరిస్థితి. ఎందుకంటే దీనిలో మీ ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోతుంది. లేదా మీ శరీరం ఉత్పత్తి చేసే ఇన్సులిన్ ను సమర్థవంతంగా ఉపయోగించుకోలేకపోతుంది. నియంత్రణ లేని మధుమేహం తరచుగా మూత్రం దుర్వాసనకు దారితీస్తుంది. బలమైన, తీపి, పండ్లతో కూడిన వాసన మూత్రానికి దారితీస్తుంది. చక్కెర, తీపి వాసన మీ మూత్రంలోని చక్కెర నుంచి వస్తుంది. మీ శరీరం మీ రక్తంలో అదనపు చక్కెరను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తోందనడానికి ఇది సంకేతం.
 

36

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ (యుటిఐ)

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (యుటిఐ) వంటి బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా మూత్రం వాసన రావడానికి దారితీస్తుంది. మూత్ర విసర్జన అమ్మోనియా లాగా ఉంటుంది. దీనిలో మూత్ర వ్యవస్థలో బ్యాక్టీరియా ఉండొచ్చు. మూత్రాశయం, మూత్రపిండాల్లో బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంది. 
 

46

ప్రోస్టాటిటిస్

ప్రోస్టాటిటిస్ అనేది ప్రోస్టేట్ గ్రంథి రుగ్మత. ఇది సాధారణంగా మంటతో సంబంధం కలిగి ఉంటుందని మాయో క్లినిక్ వివరిస్తోంది. ఈ వ్యాధి వల్ల మూత్రవిసర్జన సమయంలో విపరీతమైన నొప్పి కలుగుతుంది. మూత్రం పోడానికి కూడా కష్టంగా ఉంటుంది. అంతేకాదు ఇది దుర్వాసన కలిగిన మూత్రానికి కూడా కారణమవుతుంది. మూత్రాశయ సంక్రమణ మాదిరిగానే..ప్రోస్టాటిటిస్ మీ మూత్రంలో కుళ్లిపోయిన గుడ్డు లాంటి వాసనకు దారితీస్తుంది.

56

కాలేయ సమస్యలు

మెడ్ లైన్ ప్లస్  ప్రకారం.. కాలేయ వ్యాధి కూడా దుర్వాసనతో కూడిన మూత్రానికి దారితీస్తుంది. ఈ వాసన మూత్రంలో టాక్సిన్స్ ఏర్పడటాన్ని సూచిస్తుంది. ఇది కాలేయం దానిని సమర్థవంతంగా విచ్ఛిన్నం చేయలేనప్పుడు సంభవిస్తుంది. ముదురు రంగు మూత్రంలో ఈ వాసన వస్తుంది. బిలిరుబిన్ ఏర్పడటం వల్ల ఈ మూత్రం గోధుమ, అంబర్ లేదా నారింజ రంగులో ఉండొచ్చు. 
 

66

ఎలా గుర్తించాలి?

మీరు దేనితో బాధపడుతున్నారో తెలుసుకోవడానికి.. ముందుగా సంబంధిత లక్షణాలను గుర్తించాలి. యుటిఐ, డయాబెటిస్, కాలేయ వ్యాధి, ప్రోస్టేట్ సమస్యలు తరచుగా మీ రోగ నిర్ధారణను నిర్ధారించడంలో సహాయపడే ఇతర లక్షణాలను కలిగిస్తాయి. అయినప్పటికీ మీకు ఏరకమైన సమస్య ఉందో ఖచ్చితంగా తెలుసుకోవాలంటే మెడికల్ టెస్ట్ చేయించుకోవాలి. డాక్టర్ సలహాతో మీ రోగ నిర్ధారణను బట్టి అవసరమైన పరీక్షలు చేయించుకోండి. 

Read more Photos on
click me!

Recommended Stories