చలికాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు.. మీకోసం..

First Published Dec 11, 2022, 4:02 PM IST

చలికాలంలో చర్మం డ్రైగా మారుతుంది. ముఖ్యంగా స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఈ సీజన్ లో చర్మం ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని చిట్కాలను తప్పక పాటించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

skin care

రోజురోజుకు ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. దీంతో చాలా మంది చలిమంటలు వేసుకుంటుంటారు. కానీ ఈ చలిమంటలు, చల్లని గాలులు మన చర్మ ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీస్తాయి. నిజానికి చర్మ సంరక్షణ సీజన్ ను బట్టి మారుతూ ఉంటుంది. అందుకే చలికాలంలో ఒక్క శరీర ఆరోగ్యంపైనే కాదు.. చర్మ ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలి. చలికాలంలో మన చర్మం మరింత డ్రైగా మారుతుంది. ఎందుకంటే ఈ సీజన్ నీళ్లను చాలా తక్కువగా తాగుతుంటారు. దీనివల్ల చర్మం తీవ్రంగా ప్రభావితమవుతుంది. చలికాలంలో చర్మం ఆరోగ్యంగా, అందంగా మెరిసిపోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

Skin Care Tips-Protect skin from cold weather like this


సన్ స్క్రీన్ లోషన్

చలికాంలో కూడా యువి కిరణాలు మీ చర్మాన్ని దెబ్బతీస్తాయి. అందుకే వీటి నుంచి చర్మాన్ని రక్షించాలంటే క్రమం తప్పకుండా సన్ స్క్రీన్ లోషన్ ను చర్మానికి అప్లై చేయండి.  అధిక SPF సన్ స్క్రీన్ లోషన్ ను అప్లై చేయండి. ముఖ చర్మం మాదిరిగానే  పెదవులు, చేతులు, కాళ్ల చర్మాన్ని కూడా  ఆరోగ్యంగా ఉంచుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు పెదాలకు లిప్ బామ్ ను ఖచ్చితంగా ఉపయోగించండి. 
 

చర్మాన్ని తేమగా ఉంచండి

ఈ కాలంలో చర్మాన్ని ఎప్పుడూ తేమగా ఉంచడం చాలా ముఖ్యం. తేమ మీ చర్మాన్ని పొడిబారకుండా ఉంచుతుంది. అలాగే మీ చర్మంపై సహజ నూనెలను కాపాడుతుంది. ఇందుకోసం మీ చర్మ రకానికి తగిన మాయిశ్చరైజర్లను ఉపయోగించండి.  ఒకవేళ మీది ఆయిలీ స్కిన్ లేదా మొటిమలు అయ్యే చర్మం అయితే రంధ్రాలు మూసుకుపోకుండా ఉండటానికి నూనె లేని ఉత్పత్తులను ఉపయోగించండి. 
 

skin care

హైడ్రేట్ గా ఉండండి

మీ చర్మం హైడ్రేటెడ్ గా ఉండటం చాలా ముఖ్యం. మీ బాడీ డీహైడ్రేషన్ బారిన పడితే స్కిన్ పై డ్రై పాచెస్ వస్తుంటాయి. ఇందుకోసం ఆలివ్ ఆయిల్, అవొకాడో  ఆయిల్ వంటి సహజ నూనెలను ఉపయోగించండి. ఇది మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. పొడి పాచెస్ పై కొద్దిగా నూనెను అప్లై చేయండి. మీ చర్మం నూనెను గ్రహించే వరకు నెమ్మదిగా మసాజ్ చేయండి. నూనె రాసిన తర్వాత మాయిశ్చరైజర్ ను తప్పకుండా అప్లై చేయాలి. ఇది మీ చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా చేస్తుంది. 
 

వేడి దగ్గర ఉండకూడదు

చలిమంటలు, రేడియేటర్లు వంటి వేడి ఉత్పత్తి వాటి దగ్గర అసలే ఉండకూడదు. ఎందుకంటే వేడిగా ఉండే ప్లేస్ లో ఉంటే మీ చర్మం పొడిగా మారుతుంది. అలాగే జీవం లేనట్టుగా కనిపిస్తుంది. మీ ఇంట్లో పొయ్యి ఉంటే దాన్ని సాధ్యమైనంత వరకు తక్కువ ప్లేస్ పెట్టండి. గాలి రావడానికి ఫ్యాన్ ను ఆన్ చేయండి. లేదా ఫుల్ స్లీవ్ షర్ట్స్, ప్యాంట్ లను వేసుకోండి. 
 

తేలికపాటి సబ్బులను ఉపయోగించండి

తేలికపాటి సబ్బులే మీ చర్మానికి చాలా మంచివి. ఎందుకంటే ఇవి మీ ముఖం, శరీరం నుంచి సహజ నూనెలను తొలగించవు. చల్లని వెదర్ కారణంగా మీ చర్మం పొడిగా, సున్నితంగా మారుతుంది. అయితే ఎక్కువ కెమికల్స్ లేని సబ్బులు మీ చర్మాన్ని చికాకు పెట్టకుండా శుభ్రపరుస్తాయి. 
 

skin care

వేడినీటిని ఎక్కువగా ఉపయోగించకండి

చలికాలమని చాలా మంది పొగలు కక్కే నీటితోనే స్నానం చేస్తుంటారు. నిజానికి చలికాలంలో చల్లని నీరు అంత సేఫ్ కాదు. అలా అని వేడినీళ్లు మంచివని కాదు. మరీ వేడిగా ఉండేనీళ్లతో స్నానం చేయడం వల్ల చర్మంపై ఉన్న సహజ నూనెలు తొలగిపోతాయి. దీంతో చర్మం పొడిబారుతుంది. ఎర్రగా మారతుంది. అందుకే ఈ సీజన్ లో మరీ చల్లగా, మరీ వేడిగా ఉండే నీళ్లకు బదులగా గోరు వెచ్చగా ఉండే నీటితో స్నానం చేయండి. 

skin care

ఆరోగ్యకరమైన ఆహారం

మనం తినే ఫుడ్ కూడా మన  ఆరోగ్యం, చర్మంపై ప్రభావం చూపుతుంది. ఈ సీజన్ లో దొరికే పండ్లను, కూరగాయలను ఎక్కువగా తినండి. సమతుల్య ఆహారం మన ఆరోగ్యానికి చాలా చాలా అవసరం. ఫ్రీరాడికల్స్ ను నుంచి చర్మాన్ని రక్షించే యాంటీ ఆక్సిండెట్లు  వీటిలో పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే పండ్లను, కూరగాయలను తినండి. అలాగే వాల్ నట్స్, గుడ్లు, సాల్మన్ వంటి ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తినండి. ఇవి మీ చర్మానికి మంచివి.  

click me!