మూత్రాశయం ఆరోగ్యంగా ఉండాలంటే..
1. మూత్రాశయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి.. మూత్రాన్ని అస్సలు ఆపుకోకూడదు. ఎప్పటికప్పుడు మూత్ర విసర్జన చేయాలి.
2. పుష్కలంగా నీటిని తాగాలి. దీంతో మూత్రం ద్వారా బ్యాక్టీరియా కూడా శరీరం నుంచి బయటకు పోతుంది.
3. క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో వ్యాయామం చేయాలి. కటి వ్యాయామాలు చేస్తే కూడా మూత్రాశయం ఆరోగ్యంగా ఉంటుంది.
4. ఆల్కహాల్, స్మోకింగ్ కు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి మూత్రాశయ క్యాన్సర్ ప్రమాదాల్ని పెంచుతాయి.
5. శృంగారంలో పాల్గొన్న తర్వాత మీ ప్రైవేట్ భాగాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. లేకపోతే ఇది సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతుంది.
6. టైట్ ఫిట్టింగ్ ప్యాంటును ధరించడం మానుకోండి. కాటన్ లోదుస్తులు మాత్రమే ధరించండి.