గ్లూకోజ్.. గ్లూకోజ్ మన ఆరోగ్యంలో ఒక ముఖ్యమైన భాగం. ఈ చక్కెరే మన శరీరానికి శక్తిని అందిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇంధనంగా పనిచేస్తుంది. ఒత్తిడిని తగ్గించేందుకు కూడా ఇది సహాయపడుతుంది. అలా అని దీన్ని వెంట తీసుకెళ్లలేము. కాబట్టి డైరీ ఉత్పత్తులు, చాక్లెట్లు, పండ్లను తీసుకోవచ్చు. మీరు అలసిపోయినప్పుడు లేదా మగతగా ఉన్నప్పుడు లేదా మీకు అవసరమైనప్పుడు వాటిని తినండి. వెంటనే శక్తిని లభిస్తుంది. ఇది మీ మనస్సును, శరీరాన్ని శక్తివంతం చేస్తుంది.