Bone Strength: బ్లాక్ టీ ఎముకలను బలంగా చేస్తుందా..?

First Published May 28, 2022, 10:23 AM IST

Bone Strength: మార్కెట్ లో ఎన్నో రకాల టీలు లభిస్తాయి. అందులో బ్లాక్ టీ, గ్రీన్ టీలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బ్లాక్ టీ తాగితే ఎముకలు బలంగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు. 

black tea

మనం తినే ప్రతి ఒక్కటీ.. మనపై ‘మంచి’, ‘చెడు’ వంటి రెండు రకాల ప్రభావాలను చూపుతాయి. లిమిట్ లో తీసుకుంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు. అదే మోతాదుకు మించితేనే అసలుకే మోసం వస్తుంది. మరో మాటలో చెప్పాలంటే..  మనం తినే ప్రతీదీ మనపై శారీరకంగా, మానసికంగా ఎక్కువ లేదా తక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే మీరు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 

ఇకపోతే చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. ఒక కప్పు టీ లేదా కాఫీని తాగనిదే ఒక్క పనికూడా చేయని వారు చాలా మందే ఉన్నారు. టీ లేదా కాఫీని తాగడం వల్ల రీఫ్రెష్ గా కనిపించడంతో పాటుగా ఎనర్జీ కూడా వస్తుంది. అందుకే ఆఫీసుల్లో పని చేసేవారు చాలా మంది రెండు మూడు గంటలకోసారి తాగుతూనే ఉంటారు. 

కానీ వీటని రెగ్యులర్ గా తాగడం మీ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. వీటిలో ఉండే కెఫిన్ ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. నిద్రలేమి, అలసట, డిప్రెషన్ వంటి ఎన్నో సమస్యలు కలుగుతయి. దీనికి తోడు పాలు, పంచదార, బెల్లం వంటి పదార్థాలు కూడా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. 

వీటన్నిటినీ పక్కన పెడితే.. వాస్తవానికి  టీ ఆరోగ్యానికి ప్రయోజనకరంగానే ఉంటుంది. ఇందులో బ్లాక్ టీ, గ్రీన్ టీ లు ముందంజలో ఉన్నాయి. టీ మెదడు పనితీరును వేగవంతం చేస్తుంది. ఆలోచనా శక్తిని పెంచుతుంది. అలాగే జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. కడుపు ఆరోగ్యానికి సహాయపడుతుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ ను  నియంత్రించడానికి, వివిధ అంటువ్యాధులను నియంత్రించడానికి సహాయపడుతుంది.

ఇది కాకుండా.. క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం, చిత్తవైకల్యం వంటి అనారోగ్య సమస్యలు, వ్యాధులను నియంత్రించడానికి కూడా టీ సహాయపడుతుందని వివిధ అధ్యయనాలు వెల్లడించాయి. 

అందులో బ్లాక్ టీ ఎముకలను బలంగా చేయడానికి కూడా సహాయపడుతుంది.  కాల్షియం, విటమిన్ డి3, విటమిన్ కె2, మెగ్నీషియం, సెలీనియం, కాపర్, బోరాన్ మరియు సల్ఫర్ వంటివి ఎముకల బలానికి సహాయపడతాయి. 

ఈ రోజుల్లో ఎముకల అరుగుదల (Osteoporosis) వంటి ఎముకలను ప్రభావితం చేసే సమస్యలు పెరుగుతున్నాయి. యువతలో కూడా ఇలాంటి వ్యాధులు కనిపిస్తున్నాయి. అయితే  బ్లాక్ టీ ఈ సమస్యను కొంతవరకు పరిష్కరించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 


బ్లాక్ టీలో ఉండే పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు దీనికి ప్రధానంగా సహాయపడతాయి. దీనిలోని పాలీఫెనాల్స్ వల్ల ఎముకలలోని ఖనిజాలు దెబ్బతినకుండా ఉంటాయి. 

అందుకే ఇతర టీ ల కంటే బ్లాక్ టీ మీ ఆరోగ్యానికి మంచి చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలా అని అదే పనిగా టీని మాత్రం తాగకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్లాక్ టీకి పాలు, షుగర్ తో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.

click me!