World menstrual hygiene day 2022: వీటిని తింటే పీరియడ్స్ రెగ్యులర్ గా అవడమే కాదు.. నొప్పి కూడా తగ్గుతుంది..

First Published May 28, 2022, 9:33 AM IST

World menstrual hygiene day 2022: పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ కారణంగా కూడా పీరియడ్స్ రెగ్యులర్ గా కావు. అయితే కొన్ని రకాల ఆహారాలు నెలసరి సరిగ్గా అయ్యేలా చేయడంతో పాటుగా ఆ సమయంలో వచ్చే కడుపు నొప్పిని కూడా తగ్గిస్తాయి. అవేంటంటే..
 

ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కొంతమందిలో ఒక సాధారణ సమస్య. హార్మోన్ల అసమానతలు దీనికి ప్రధాన కారణం. దీనితో పాటుగా ఇతర కారణాలు కూడా  irregular periods దారితీస్తాయి. అకస్మాత్తుగా బరువు తగ్గడం, ఎక్కువ వ్యాయామం, కొన్ని రకాల మందుల వాడకం, నిద్ర లేకపోవడం, టెన్షన్ , పేలవమైన ఆహారపు అలవాట్ల వల్ల పీరియడ్స్ క్రమం తప్పుతాయి. 

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (Polycystic ovary syndrome)వల్ల పీరియడ్స్ క్రమం తప్పుతాయి. పిసిఒఎస్ (PCOS) హార్మోన్ల మార్పులు లేదా ఇన్సులిన్ హార్మోన్ల నిరోధకత కారణంగా ఇలా జరగొచ్చు. అధిక బరువు వల్ల హార్మోన్ల నష్టానికి దారితీస్తుంది. అలాగే ఇన్సులిన్ స్థాయిలకు అంతరాయం కలుగుతుంది.  ఈ హార్మోన్ల అసమతుల్యతే క్రమరహిత కాలాలకు (irregular periods) కు కారణమవుతాయి.

ఊబకాయం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో పాటుగా మరెన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందుకే వీలైనంత వరకు బరువు పెరగకుండా చూసుకోవాలి. అలాగే మీరు తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తింటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్య తొలగిపోతుంది. మీ పీరియడ్స్ రెగ్యులర్ గా కావడానికి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసుకుందాం పదండి. 

బొప్పాయి (Papaya).. బొప్పాయిలోని కెరోటిన్ శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలను ఉత్తేజపరిచి, క్రమబద్ధీకరిస్తుంది. ఇది రుతుస్రావం నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది.
 

అల్లం (Ginger).. బహిష్టు (Menstruation) నొప్పిని తగ్గించడంలో అల్లం చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. నొప్పికి కారణమయ్యే ప్రోస్టాగ్లాండిన్స్ స్థాయిలను తగ్గించడంలో అల్లం ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.  premenstrual syndrome తో సంబంధం ఉన్న అలసటను ఎదుర్కోవటానికి కూడా ఇది సహాయపడుతుంది. అంతేకాదు ఈ అల్లం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యను తొలగిస్తుంది. 

దాల్చిన చెక్క (Cinnamon).. దాల్చిన చెక్కలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీనిని ఆహారంలో తినడం వల్ల అది రుచిగా అవడమే కాదు.. మన ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. నొప్పి, రుతుస్రావం, వికారం, వాంతులు వంటి సమస్యలను తగ్గించడానికి దాల్చిన చెక్క ఎంతో సహాయపడతుంది. 
 

బీట్ రూట్ (Beat root).. బీట్ రూట్ లో  ఇనుము, ఫోలిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటాయి. బీట్ రూట్ కూడా బహిష్టు నొప్పిని తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది.
 

Turmeric

పసుపు (Turmeric ).. పసుపులో బలమైన యాంటీ స్పాస్మోడిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. పసుపు రుతుస్రావ నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది రుతుచక్రాన్ని నియంత్రించడానికి, హార్మోన్ల సమతుల్యతను సరిచేయడానికి సహాయపడుతుంది. పాలలో అర టీస్పూన్ పసుపు కలిపి రోజూ తాగడం వల్ల రుతుక్రమం క్రమంగా అవుతుంది. 

click me!