Health Tips: ఈ పండు గుండెపోటు రిస్క్ ను తగ్గిస్తుంది..

Published : Jul 17, 2022, 04:03 PM IST

Health Tips: గుండె కొట్టుకున్నంత వరకే మన ప్రాణం ఉంటుంది. ఇలాంటి గుండెను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ఒక స్వీట్ ఫ్రూట్ గుండె జబ్బు ప్రమాదాన్ని తగ్గిస్తుంది..   

PREV
17
Health Tips: ఈ  పండు గుండెపోటు రిస్క్ ను తగ్గిస్తుంది..
heart attack

మారుతున్న లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది హార్ట్ ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేస్తున్నారు. గజిబిజీ లైఫ్ స్టైల్, ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ను ఎక్కువగా తినడం, శారీరక శ్రమ లేకపోవడం వంటి వివిధ కారణాల వల్ల గుండె ప్రమాదంలో పడుతుంది. ఈ ఆహారాలు నోటికి రుచిగా ఉన్నా.. గుండెకు, మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కాదు. ఎందుకంటే ఈ ఫుడ్స్ రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. దీనివల్ల ఫ్యూచర్ లో అధిక రక్తపోటు బారిన పడతారు. దీని తర్వాత Coronary artery disease,heart attack Coronary artery disease,Triple vessel disease వంటి ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది. అయితే స్ట్రాబెర్రీ పండు ఈ ప్రమాదాలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 

27

స్ట్రాబెర్రీ పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండు గుండె ఆయుష్షును కూడా పెంచుతుంది. అంతేకాదు ఇది గుండెపోటు, స్ట్రోక్, గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. 

37

స్ట్రాబెర్రీల్లో పాలీఫెనాల్ అనే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. దీనిలో ఉండే వివిధ రకాల పోషకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండెపోటు ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తాయి. 

47

రోజుకు ఎన్ని స్ట్రాబెర్రీలను తినాలి

ఆరోగ్యంగా ఉన్న వయోజనులు రోజుకు 2 నుంచి 3 కప్పుల స్ట్రాబెర్రీలను తినొచ్చని ఆరోగ్య నిపుణులు సలహానిస్తున్నారు. ఇది శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని చాలా వరకు తగ్గిస్తుంది. దీంతో రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య బాగా పెరుగుతుంది. 
 

57

గుండెపోటు రావడానికి ప్రధాన కారణం శరీరంలో చెడు కొలెస్ట్రాల్ విపరీతంగా పేరుకుపోవడం. ఈ చెడు కొలెస్ట్రాల్ లేకుంటే ఎలాంటి గుండె సమస్యలు రావు. అయితే ఈ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో స్ట్రాబెర్రీలు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. పలు పరిశోధన ప్రకారం.. స్ట్రాబెర్రీలు గుండెను ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంచుతాయని రుజువైంది.

67

అంతేకాదు ఈ స్ట్రాబెర్రీలు చర్నాన్ని కాంతివంతంగా కూడా చేస్తాయి.  ముఖంపై ఉండే మొటిమలు, మొటిమల తాలూకు మచ్చలను వదిలించడంలో ఇవి ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఇందుకోసం కొన్ని స్ట్రాబెర్రీలను తీసుకుని వాటినుంచి రసాన్ని తీసి ముఖానికి ప్లై చేయాలి. ఒక 15 నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేస్తే ముఖం నీట్ గా మారిపోతుంది. 

77

స్ట్రాబెర్రీలు కంటి చూపును కూడా మెరుగుపరుస్తాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అంధత్వాన్ని దూరం చేస్తాయి. అంతేకాదు దీనిలో విటమిన్ సి కూడా అధికంగానే ఉంటుంది. ఇది శరీరానికి హాని చేస్తే ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories