Boost Immunity: ఈ వంటింటి పదార్థాలు ఇమ్యూనిటీ పవర్ పెంచుతాయి..

Published : Jul 17, 2022, 02:26 PM IST

Boost Immunity: రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటేనే ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా ఉంటాం. ముఖ్యంగా ఈ సీజన్ లో ఎన్నో వ్యాధులో సోకే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఇమ్యూనిటీని పెంచుకోవాల్సిన అవసరం ఎంతో  ఉంది.   

PREV
17
 Boost Immunity: ఈ వంటింటి పదార్థాలు ఇమ్యూనిటీ పవర్ పెంచుతాయి..

రోగనిరోధక వ్యవస్థ బలంగా  ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ప్రస్తుతం సీజనల్ వ్యాధులతో పాటుగా, కరోనా, మంకీపాక్స్ వైరస్ ల వ్యాప్తి ఎక్కువగా దారుణంగా . ఈ రోగాలన్నీ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండేవారికే వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే రోగనిరోధక శక్తిని వీలైనంత తొందరగా పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. 
 

27
immunity

ఇమ్యూనిటీ పవర్ బాగా ఉంటేనే ప్రాణాంతక వైరస్ లు, ఇతర రోగాలతో పోరాడవచ్చు. అయితే వంటింట్లో ఉండే కొన్ని రకాల పదార్థాలతో కూడా ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

37

అల్లం (ginger)

అల్లంలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి ఎన్నో రోగాలను సైతం తరిమికొట్టగలవు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అల్లం కణాలు పోషకాలను గ్రహించడాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాదు ఇది రోగనిరోధక వ్యవస్థను బలంగా చేస్తుంది. 
 

47

పసుపు (Turmeric)

పసుపులో యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలుంటాయి. ఇవి ఎన్నో రకాల అంటువ్యాధులతో పోరాడుతాయి. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. ఈ మసాలా లో ఖనిజాలు, విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి.
 

57
black pepper

మిరియాలు (Pepper)

నల్ల మిరియాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే Carminative లక్షణాలుంటాయి. ఇవి జీర్ణ సమస్యలను, పేగు వాయువు వంటి ప్రమాదాలను తగ్గిస్తుంది. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడమే కాదు.. జ్వరాన్నికూడా తగ్గించగలవు. 
 

67

వెల్లుల్లి (garlic)

వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడమే కాదు వివిధ రకాల అంటువ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. 
 

77

తులసి (basil)

తులసిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. ఇవి దగ్గు, జలుబు వంటి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. తులసి ఆకులతో టీ తయారుచేసుకుని తాగితే ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. తులసి ఆకులు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే శరీర శక్తి స్థాయిలను కూడా పెంచుతాయి. వీటిని తీసుకోవడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories