Health Tips: కొబ్బరి, బెల్లం తింటే ఇన్ని అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయా..?

Published : Jul 17, 2022, 03:13 PM IST

Health Tips: కొబ్బర, బెల్లాన్ని కలిపి తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఇది బరువును తగ్గించడంతో పాటుగా కీళ్ల నొప్పలను కూడా తగ్గిస్తాయి.

PREV
18
Health Tips: కొబ్బరి, బెల్లం తింటే ఇన్ని అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయా..?

కొబ్బర, బెల్లంలో మెగ్నీషియం, ఇనుము పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు దీనిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇక కొబ్బరలో చక్కెరలో కంటే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. దీనిలో కాల్షియం కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కానీ కొబ్బరను, బెల్లాన్ని చాలా తక్కువగా తింటుంటారు. ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. కొబ్బర, బెల్లాన్ని కలిపి తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
 

28

దగ్గు, జలుబు నివారణ

బెల్లం, కొబ్బరను కలిపి తినడం వల్ల దగ్గు, జలుబు సమస్యల నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. గోరు వెచ్చని నీటిలో కొంచెం బెల్లం వేసుకుని లేదా.. టీ లో చక్కెరకు బదులుగా బెల్లాన్ని వేసి తాగినా శ్వాస సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. 
 

38

జీర్ణక్రియ మెరుగుపడుతుంది

కొబ్బర బెల్లంను క్రమం తప్పకుండా తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. అంతేకాదు జీర్ణ ఎంజైమ్లను సక్రమంగా ఉంచుతుంది. అలాగే ఇది జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది. 

48

బరువు తగ్గేందుకు సహాయపడుతుంది

కొబ్బర, బెల్లంలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు శరీరంలో నీరు అవసరమైన దానికంటే నిల్వ లేకుండా కాపాడుతుంది. తద్వారా మీ బరువు నియంత్రణలో ఉంటుంది.
 

58

గర్భిణులకు సహాయపడుతుంది

గర్భంతో ఉన్న ఆడవారు కొబ్బర, బెల్లాన్ని తినడం వల్ల పిండంపై చెడు ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటుంది. గర్భిణులు కొబ్బర బెల్లాన్ని ఏడో నెల నుంచి తీసుకుంటే ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ నుంచి ఉపశమనం లభిస్తుంది. 
 

68

మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనం

తల ఒకవైపు మాత్రమే వచ్చే మైగ్రేన్ నొప్పి బాధకరమైంది. దీన్ని నుంచి ఉపశమనం పొందడం అంత తేలిక కాదు. అయితే ఈ సమస్య ఉన్న వారు కొబ్బర, బెల్లాన్ని కలిపి తింటే మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. 

78

ఎనర్జీ బూస్టర్

కొబ్బర, బెల్లంలో కార్భోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చాలా త్వరగా జీర్ణమవుతాయి. కాబట్టి అలసటగా ఫీలైనప్పుడు వీటిని తింటే వెంటనే మీ శరీరానికి శక్తి లభిస్తుంది. 
 

88

కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం

కొబ్బరి, బెల్లంలో కాల్షియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీనివల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. అలాగే కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ తో సంబంధం ఉన్న ఇతర సమస్యలు కూడా తగ్గిపోతాయి. 
 

Read more Photos on
click me!

Recommended Stories