కాటన్ బెడ్ షీట్స్ ను ఉపయోగించడం వల్ల హాయిగా నిద్రరావడమే కాదు.. ఎన్నో రోగాలు కూడా తగ్గిపోతాయి తెలుసా..?

First Published Sep 16, 2022, 2:12 PM IST

రాత్రుళ్లు హాయిగా నిద్రపోవాలంటే.. మనం పడుకునే ప్లేస్ సౌకర్యవంతంగా ఉండాలి. దిండు, దుప్పటిలో ఏది అసౌకర్యంగా ఉన్నా సరిగ్గా నిద్రరాదు. అయితే రాత్రుళ్లు మెలుకువ రాకుండా హాయిగా నిద్రపోవాలంటే మాత్రం ఈ బెడ్ షీట్ ను వాడాల్సిందేనంటున్నారు నిపుణులు. 
 

ప్రశాంతంగా నిద్రపోవాలంటే మీరు పడుకునే ప్లేస్, బెడ్ షీట్ కంఫర్ట్ గా ఉండాలి. లేకపోతే అసలు నిద్రేపట్టదు. ముఖ్యంగా బెడ్ షీట్ బాగా లేకపోతే.. నిద్రలో దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏదేమైనా ఈ రోజుల్లో చాలా మంది స్టైలిష్ సింథటిక్ బెడ్ షీట్లనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కానీ ఇవి మన ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. వీటికి బదులుగా కాటన్ బెడ్ షీట్ ను ఉపయోగించండి. ఇవి మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి.

కాటన్ ను బట్టల రారాజుగా పిలుస్తారు. ఈ కాటన్ తో కేవలం మనం వేసుకునే బట్టలనే కాదు బెడ్ షీట్లను కూడా తయారుచేస్తారు. ఇవి ఎంతో కంఫర్ట్ గా ఉంటాయి. వెచ్చని వాతావరణంలో నివసించే వ్యక్తులకు ఈ బెడ్ షీట్లు అనుకూలంగా ఉంటాయి. కాటన్ చాలా మెత్తగా ఉంటుంది. అలాగే ఇవి శ్వాస తీసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటాయి. కాటన్ బెడ్ షీట్లను ఉపయోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం పదండి. 
 

నిద్రలేమి సమస్యను పరిష్కరిస్తుంది

ఒత్తిడితో కూడిన లైఫ్ స్టైల్ చాలా మందిని నిద్రలేమి సమస్యతో బాధపడేలా చేస్తుంది. అయితే నిద్రలేమి సమస్యను ఫేస్ చేస్తున్నవారికి కాటన్ బెడ్ షీట్ బాగా ఉపయోగపడుతుంది. కాటన్ బెడ్ షీట్ పై పడుకోవడం వల్ల హాయిగా నిద్రపోతారు. కాటన్ మృదువైన ఫ్యాబ్రిక్ కాబట్టి.. దీనిపై పడుకోగానే చాలా తొందరగా నిద్రపోతారు. ఎంత త్వరగా నిద్రపోయినా.. నిద్ర పట్టని వారికి కాటన్ బెడ్ షీట్లు  మంచి ఔషదంలా పనిచేస్తాయి. 

చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది

కాటన్ బెడ్ షీట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. ఇవి ఎలాంటి చర్మ రకాలను కలిగున్న వారికైనా ఉపయోగపడతాయి. అవి సహజమైనవి కావడమే కాదు రసాయనిక రహితమైనవి కూడా. అందులోనూ ఇవి సున్నితమైన చర్మం గలవారికి గొప్పగా ఉపయోగపడతాయి. బెడ్ షీట్ లోని సహజ తేమ బెడ్ ను తాజాగా, సౌకర్యవంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ బెడ్ షీట్స్ మీ చర్మానికి ఎలాంటి హాని చేయవు. 
 

శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది

కాటన్ బెడ్ షీట్స్ శరీరాన్ని చల్లగా ఉంచడమే కాదు.. మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. ఇది మన శరీరం నుంచి అదనపు తేమను శోషించుకోవడానికి సహాయపడుతుంది. ఈ ఫాబ్రిక్ మనం హాయిగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.
 

వేడి దద్దుర్లను నివారిస్తుంది

చర్మంలో ఉండిపోయిన చెమట కారణంగా వేడి దద్దుర్లు అవుతాయి.  సాధారణంగా ఇవి వేడి, తేమతో కూడిన ప్రదేశాలలో నివసించే చిన్నపిల్లలు, పెద్దల్లో కనిపిస్తాయి. అయితే కాటన్ బెడ్ షీట్స్ ను ఉపయోగించడం వల్ల వేడి చాలా వరకు తగ్గుతుంది. ఈ బెడ్ షీట్స్ వేడి దద్దుర్లు రాకుండా చేస్తాయి. 

మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది

కాటన్ బెడ్ షీట్స్ మృదువుగా, చాలా సౌకర్యవంతమైన ఉంటాయి. వీటిపై పడుకున్న వెంటనే నిద్రవస్తుంది. ఈ బెడ్ షీట్స్ పై పడుకుంటే మీరు ఎక్కువ సేపు నిద్రపోతారు. దీనిపై పడుకోవడం వల్ల మీకు ఎలాంటి శ్వాస సంబంధింత సమస్యలు రావు. దీంతో మీరు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. 
 

శ్వాసకోశ వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడుతుంది

కాటన్ బెడ్ షీట్స్ లో గాలి సులువుగా ఆడుతుంది. కాబట్టి వీటిలో బ్యాక్టీరియా, ధూళి పేరుకుపోయే అవకాశమే ఉండదు. ఆస్తమాతో బాధపడేవారికి కాటన్ బెడ్ షీట్స్ చాలా మంచివి. కాటన్ బెడ్ షీట్స్ ను కప్పుకుని పడుకోవడం వల్ల అందులోంచి తాజా గాలిని పీల్చుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. 

కాటన్ బెడ్ షీట్స్ ను మెయింటైన్ చేయడం చాలా సులువు. వీటిని ఉతకడం, ఆరబెట్టడం చాలా ఈజీ. వీటిని యూజ్ చేయడం వల్ల మీ  శరీరంపై ఎక్కువ ఒత్తిడి పడదు.

click me!