వంద వయాగ్రాలతో సమానమైన విత్తనాలు.. ఇవి తింటే అందులో రాజు మీరే!

First Published Sep 16, 2022, 2:07 PM IST

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఆహార విషయంలో ఎన్నో మార్పులు చోటు చేసుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.
 

ముఖ్యంగా సంతానలేమి సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. అయితే పెళ్లయిన సంవత్సరాలు గడుస్తున్నా సంతానం లేకపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి.ముఖ్యంగా వీర్యకణాల ఉత్పత్తి తక్కువ అయినప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అయితే వీర్యకణాల అభివృద్ధి కొరకు ఈ విత్తనాలు తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు.
 

ప్రస్తుత కాలంలో చాలామంది తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు.పోషకాలు కలిగినటువంటి ఆహార పదార్థాలను పక్కనపెట్టి కేవలం జంక్ ఫుడ్ కి బాగా అలవాటు పడ్డారు. ఈ క్రమంలోనే ఒబిసిటీ రావడంతో ఎన్నో అనారోగ్య సమస్యలు రావడమే కాకుండా మగవారిలో వీర్యకణాల ఉత్పత్తి కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ఇలా వీర్యకణాల ఉత్పత్తి తగ్గడం వల్ల సంతానలేమి సమస్యలు ఎదురవుతున్నాయి.
 

ఈ క్రమంలోనే చాలామంది వీర్యకణాల అభివృద్ధి కోసం ఎన్నో రకాల మందులను ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా చాలామంది వయాగ్రా మాత్రలను ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా మందుల రూపంలో కాకుండా పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా వీర్య కణాల అభివృద్ధిని పెంపొందించుకోవచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు.
 

నిపుణుల సూచనల ప్రకారం వేరుశెనగ గింజలలో ఎన్నో పోషకాలు ఉన్నాయని తెలియజేశారు. వేరుశనగలో ఉండే పోషకాలు శారీరకంగా ఎంతో బలాన్ని అందిస్తాయి. అదేవిధంగా వీర్య లోపాన్ని కూడా తగ్గిస్తాయని పలు పరిశోధనలలో రుజువైనట్లు నిపుణులు వెల్లడించారు.అయితే ఈ వేరుశనగ గింజలను ఉడికించి తీసుకోవడం వల్ల మన శరీరానికి కావలసిన ప్రోటీన్స్ పుష్కలంగా లభిస్తాయి.
 

ఇక వేరుసెనగలు ఉన్నటువంటి ప్రోటీన్లు మన శరీరాన్ని ఉత్సాహంగా ఉంచడమే కాకుండా మెదడుని కూడా ఎంతో చురుగ్గా ఉండేలా చేస్తుంది. శరీరంలో ఏర్పడే అలసటను తొలగించి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది.ముఖ్యంగా ఎవరైతే వీర్యకణాల ఉత్పత్తితో ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారు వేరుశెనగపొడిని పాలల్లో ఉడికించి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అభివృద్ధి జరుగుతుంది. ఇలా తరుచూ వేరుశెనగ గింజలు తీసుకోవడం వల్ల మాంసాహారంలో మనకు లభించే పోషకాలన్ని కూడా ఇందులో లభిస్తాయి.

ఇలా అత్యధిక పోషకాలు కలిగినటువంటి వేరుశెనగ గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడంతో సరైన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడమే కాకుండా ఎన్నో సమస్యలకు కూడా దూరంగా ఉండవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. చిన్నపిల్లలకు కూడా వేరుశెనగ గింజలు ఎంతో బలాన్ని చేకూర్చడమే కాకుండా  పిల్లలలో మేధాశక్తిని పెంపొందించడంలో వేరుశెనగ గింజలు ఎంతో దోహదపడతాయి.

click me!