Image: Getty Images
పెళ్లి తర్వాత దంపతులు అన్యోన్యంగా ఉండాలంటే వారి మధ్య కంపాటబులిటీ ఎక్కువగా ఉండాలి అని చెబుతూ ఉంటారు. అసలు.. కంపాటబులిటీ ఉంది అని ఎలా చెబుతాం అనే సందేహం మీకు రావచ్చు. ఇదిగో.. నిజంగా దంపతుల మధ్య కంపాటబులిటీ ఉందో లేదో... ఇదిగో ఇలా తెలుసుకోవచ్చు.
Image: Getty Images
1.దంపతుల మధ్య కంపాటబులిటీ ఉంటే... ఆ దంపతలకు ఒకరి గురించి మరొకరికి పూర్తిగా తెలుస్తుందట. మొత్తం తెలియడం అంటే... ప్రతి ఒక్క విషయం... వారు ఏ సమయంలో ఎలా ఉంటారు అనే విషయాన్ని ఒకరికొకరు పూర్తిగా అర్థం చేరసుకుంటారట.
Image: Getty Images
2. నిజంగా ఇద్దరు దంపతుల మధ్య కంపాటబులిటీ ఉంటే... వారు తమ పార్ట్ నర్ ని తమ కోసం ఏ విషయంలోనూ మార్చుకోమని చెప్పరు. ఒకరిని మరొకరు అర్థం చేసుకుంటారు. అంతేకానీ... ఏ విషయంలోనూ ఒకరి కోసం ఒకరు మారరు. ఒకరిని మరొకరు ఇంప్రెస్ చేయాలని మాత్రం అనుకోరు.
Image: Getty Images
3.దంపతులు అన్నాక... ఇద్దరికీ ఒకే ఇష్టాలు ఉండాలనే రూల్ ఏమీ లేదు. కానీ...ఒకరిని మరొకరు అర్థం చేసుకునే దంపతులు... ఒకరి ఇష్టాన్ని మరొకరు గౌరవిస్తారు. కామన్ గా ఉండే ఇష్టాలు ఉంటే వాటిని ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తారు.
happy couple life
4. అన్యోన్యతగా ఉండే దంపతులు.. ఒకరితో మరొకరు గొడవ పడుతూ ఉంటారట. నమ్మలేకపోయినా ఇది నిజం. దంపతులు.. గొడవ పడటం కూడా.. వారి అన్యోన్యతకు ఇక చిహ్నమట.
5.ఈ దంపతులు మనస్సాక్షి కి ఎక్కువ విలువ ఇస్తారు. ఒకరితో మరొకరు బెటర్ గా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఒకరి కోసం మరొకరు అన్నట్లుగా ఉంటారు.
Image: Getty Images
6.ఇద్దరు దంపతులు తమ భవిష్యత్తుకు సంబంధించిన ప్రతి విషయంలో కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. అది ఎలాంటిది అయినా.. ఇద్దరూ కలిసి చర్చించుకొని మరీ నిర్ణయం తీసుకుంటారు.
7.ఏదైనా సమస్య తలెత్తినప్పుడు వారు దంపతులు ఇద్దరూ కలిసి చర్చించి మరీ తమ సమస్యలను పరిష్కరించుకుంటారు. అంతేకాదు.. తమ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటారు.