మొత్తం మీద పాలు ఎముకల ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. ఎందుకంటే పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. పాలు ఒక్క ఎముకలకే కాదు మన మొత్తం శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే పాలలో కాల్షియంతో పాటుగా విటమిన్ డి, భాస్వారం మొదలైన పోషకాలు ఉంటాయి. ఇవి ఎముక నిర్మాణం, ఇతర జీవ విధులకు సహాయపడతాయి.
పాలు ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. అలాగే కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.