జర జాగ్రత్త.. కాకరకాయను తిన్న తర్వాత వీటిని అస్సలు తినకండి.. తిన్నారో మీ పనిఅంతే..

Published : Dec 15, 2022, 05:00 PM IST

చలికాలంలో కారకాయలను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే కాకరకాయలను తిన్న తర్వాత కొన్ని ఆహారాలను అసలే తినకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.   

PREV
19
జర జాగ్రత్త.. కాకరకాయను తిన్న తర్వాత వీటిని అస్సలు తినకండి.. తిన్నారో మీ పనిఅంతే..

కాకరకాయ రుచిలో చేదుగా ఉంటుంది. కాని ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది. అలాగే ఎన్నో రకాల వ్యాధులకు దూరంగా ఉంటారు. కాకరకాయలను తీసుకోవడం వల్ల కడుపునకు సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి. రక్తం శుద్ధి అవుతుంది. హైపర్ టెన్షన్ నియంత్రణలో ఉంటుంది.  సోరియాసిస్ తగ్గిపోతుంది. ఈ కాకరకాయలో మెగ్నీషియం, పొటాషియం, ఫోలేట్, జింక్ పుష్కలంగా ఉంటాయి. దీనిలో కొలెస్ట్రాల్ శాతం చాలా తక్కువగా ఉంటుంది.  సోడియం, విటమిన్ బి6, ఇనుము, ఫాస్పరస్, పాంథోనిక్ యాసిడ్, థయామిన్, రెబోఫ్లేవిన్  లు పుష్కలంగా ఉంటాయి. పది పదిహేను రోజులకు  ఒకసారైనా కాకరకాయ జ్యూస్ ను తాగితే ఆరోగ్యం బాగుంటుంది. 
 

29

గర్భిణులకు కూడా కాకరకాయ ఎంతో మేలు చేస్తుంది. అయితే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది ఆరోగ్యానికి ఎంత ప్రయోజనకరంగా ఉన్నా.. కాకరకాయను తిన్న తర్వాత కొన్ని ఆహారాలను అసలే తినకూడదు. ఈ ఆహారాలతో పాటుగా కాకరకాయను తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు . అలా తింటే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

39

ముందుగా కాకరకాయ వల్ల కలిగే ప్రయోజనాలు

చేదుగా ఉండే కాకరకాయలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీనిని తీసుకోవడం ద్వారా మన శరీరానికి కెరోటిన్, బీటా కెరోటిన్, భాస్వరం, ఐరన్, జింక్, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటి పోషకాలు బాగా లభిస్తాయి.
 

49

పాలు

కాకరకాయ కూరను, లేదా ఫ్రై వంటి కాకరకాయతో చేసిన ఏ ఆహారాన్నైనా తిన్న తర్వాత పాలు అస్సలు తాగకూడదు. ఇలా తాగితే.. కడుపునకు సంబంధించిన సమస్యలు వస్తాయి. కాకరకాయ తిన్న తర్వాత పాలు తాగడం వల్ల మలబద్ధకం, కడుపులో నొప్పి, కడుపులో మంట, చికాకు వంటి సమస్యలు వస్తాయి. 
 

59

బెండకాయ 

కాకరకాయ కూరను తిన్న తర్వాత బెండకాయ వంటి కూరగాయలను కూడా తినకూడదు. ఒకవేళ కాకరకాయతో పాటుగా  బెండకాయను తింటే.. మీరు తిన్నది సరిగ్గా జీర్ణం కాదు. దీన్ని జీర్ణం చేసుకోవడం శరీరానికి కష్టంగా ఉంటుంది. 
 

69

మామిడి పండ్లు 

కాకరకాయతో పాటుగా మామిడి పండ్లను తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని బాగా దెబ్బతింటుంది. కాకరకాయను తిన్న వెంటనే మామిడి పండ్లను తింటే వాంతులు, చిరాకు, వికారం, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. నిజానికి ఈ రెండు పదార్థాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.
 

79

ముల్లంగి 

కాకరకాయ తిన్న తరువాత ముల్లంగి లేదా ముల్లంగితో చేసిన ఆహారాలను కూడా అసలే తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  ముల్లంగి, కాకరకాయ లు విభిన్న రుచిని కలిగి ఉంటాయి. ఈ కాంబినేషన్ లో తినడం వల్ల గొంతులో అదో రకంగా ఉంటుంది. అలాగే దగ్గు, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. 
 

89

పెరుగు

పెరుగు, కాకరకాయలు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా.. ఇంతా కాదు. ఈ రెండిండిలో ఎన్నో పోషకాలు, ఖనిజాలు ఉంటాయి. అయినప్పటికీ.. ఈ రెండిని కలిపి తినకూడదు.  కాకరకాయను తిన్న తర్వాత పెరుగును తీసుకుంటే చర్మంపై దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇలా అస్సలు తినకండి. 
 

99

రాత్రి సమయంలో కాకరకాయను తినొద్దు

రాత్రి సమయంలో కాకరకాయను తినడం అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే కాకరకాయ రుమాటిజం కారకంగా పరిగణించబడుతుంది. ఒకవేళ మీరు రాత్రిపూట కాకరకాయను తిన్నట్టైతే.. మీ కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. అలాగే కడుపు నొప్పి, కడుపు తిమ్మిరి వంటి సమస్యలు కూడా వస్తాయి. అందుకే రాత్రి సమయంలో కాకరకాయ తినడం మానుకోండి.
 

Read more Photos on
click me!

Recommended Stories