Health Tips: ఆపిల్ లో ఎన్నో పోషకాలుంటాయి. ఇవి మనల్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకే వీటిని రెగ్యులర్ గా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే ఆపిల్ లోని పోషకాలు మన శరీరానికి అందాలంటే.. ఆపిల్ ఇలాగే తినాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Health Tips: రోజుకు ఒక ఆపిల్ పండును తినడం వల్ల వైద్యుడి అవసరమే లేదంటారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఆపిల్ పండులో మన శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి. అయితే కొంతమందికి ఆపిల్ ను ఎలా తినాలో తెలియదు. దాంతో వారు ఆపిల్ పోషకాలను పొందలేకపోతారు.
27
అయితే కొంతమంది ఆపిల్ ను తొక్కతో సహా తినేస్తే.. మరికొంత మంది మాత్రం తొక్కను తీసేసి తింటుంటారు. నిజానికి ఆపిల్ ను ఎలా తిన్నా దాని ప్రయోజనాలు మాత్రం తగ్గవని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఆపిల్ గుజ్జులో దీనిలో విటమిన్ ఏ, ఫైబర్, పిండి పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆపిల్ తొక్కలో కూడా ముఖ్యమైన పోషకాలుంటాయి. ఇవి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అవేంటంటే..
37
ఊపిరితిత్తులకు (Lung)మేలు: ఆపిల్ తొక్క ఊపిరితిత్తుల ఆరోగ్యానికి సహాయపడుతుంది. దీనిలో ఉండే Quercetin అనబడే Anti-inflammatory compound ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతాయి.
47
గుండెకు మేలు: ఆపిల్ తొక్కలో గుండెకు మేలు చేసే గుణాలుంటాయి. ఇందులో పుష్కలంగా యాంటీ ఆక్సిండెట్లు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంతో పాటుగా రక్తంలో షుగర్ లెవెల్స్ ను కూడా తగ్గిస్తాయి.
57
వెయిట్ ను తగ్గిస్తాయి: ఆపిల్ తొక్క మన ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది. దీనిలో ఉండే పోషకాలు కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూ.. మీ శరీరానికి అవసరమైన పోషకాలను తీసుకుంటే మీరు బరువు తగ్గే ప్రాసెస్ ఫాస్ట్ అవుతుంది. దీనిలో ఉండే పాలీఫెనాల్స్ కొవ్వును నియంత్రణలో ఉంచుతాయి.
67
జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది: ఆపిల్ తొక్క కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఈ సమస్యలున్న వారు ఆపిల్ ను తొక్కతో సహా తినేయాలి. ఇది మధుమేహులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాదు ఈ తొక్కలోని పోషకాలు ఎముకలను కూడా బలంగా ఉంచుతాయి.
77
ఆపిల్ తొక్కలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ కె, విటమిన్ ఎ, విటమిన్ సి, భాస్వరం, కాల్షియం వంటివి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి గుండెను, ఎముకలను, మూత్రపిండాలను, బ్రెయిన్ ను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో సహాయపడతాయి.