Health Tips: పండ్లు మన శరీరంలో ఖనిజాలు, విటమిన్లు, ఫైబర్ లోపాన్ని భర్తీ చేస్తాయి. కానీ కొన్ని పండ్లను మాత్రం తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాటిలో ఒకటి బొప్పాయి. ఈ పండు కొంతమంచిది మంచిచేసినా.. కొందరికి మాత్రం చెడే చేస్తుంది. ఈ బొప్పాయిని ఎవరెవరు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
బొప్పాయి (papaya) ఒక సూపర్ ఫుడ్. దీనిలో ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం మరియు మెగ్నీషియం వంటి అనేక పోషకాలు లభిస్తాయి. దీన్ని తినడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
28
ఇది జీర్ణక్రియ, బరువు పెరగడం, మధుమేహం, క్యాన్సర్, కొలెస్ట్రాల్, బీపి వంటి వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తుంది. ఈ పండు మనకు సంవత్సరం పొడుగునా అందుబాటులో ఉంటుంది. కాబట్టి చాలా మంది దీనిని క్రమం తప్పకుండా తినడానికి ఇష్టపడతారు.
38
అయితే బొప్పాయి కొందరికి హానికరం. ఉదాహరణకు Heart rate uncontrolled ఉన్నవాళ్లు బొప్పాయిని అస్సలు తినకూడదు. ఎందుకంటే ఇది జీర్ణవ్యవస్థలో హైడ్రోజన్ సైనైడ్ ను ఉత్పత్తి చేయగల సైనోజెనిక్ గ్లైకోసైడ్ అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. ఇది హృదయ స్పందనను మరింత వేగవంతం చేస్తుంది. ఇది మీ గుండెను దెబ్బతీస్తుంది.
48
గర్భిణీ స్త్రీలు బొప్పాయిని తినకూడదు: గర్భిణులు బొప్పాయిని అస్సలు తినకూడదు. ఎందుకంటే ఇది గర్భస్రావం అయ్యే అవకాశాలను పెంచుతుంది. బొప్పాయి వేడి గుణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి దీనిని గర్భిణులు తినకూడదు. బొప్పాయి గర్భాశయ సంకోచాన్ని ప్రేరేపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇది కాకుండా బొప్పాయిలో పపైన్ ఉంటుంది. ఇది గర్భంలోని బిడ్డపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.
58
మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు కూడా బొప్పాయిని ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే బొప్పాయి ఎక్కువగా తినడం వల్ల కాల్షియం ఆక్సలేట్ ఉత్పత్తి అవుతుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లను పెంచుతుంది. తరువాత ఇది మూత్రం ద్వారా బయటకు రావడాన్ని కూడా కష్టతరం చేస్తుంది.
68
మీరు ఒక రకమైన అలెర్జీతో ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా బొప్పాయిని తినకూడదు, ఎందుకంటే బొప్పాయి లోపల చిటినేస్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మీరు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. అలాగే దగ్గు సమస్య కూడా రావొచ్చు.
78
మధుమేహ వ్యాధిగ్రస్తులకు బొప్పాయిని తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ శరీరంలో చక్కెర పరిమాణం ఇప్పటికే ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం మీరు తీపి బొప్పాయిని తినకూడదు. ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది.
88
Papaya
పైన పేర్కొన్న వారు తప్ప మిగిలిన వారికి బొప్పాయి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అలా అని బొప్పాయిని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. కాబట్టి దీనిని ఎక్కువగా తినకండి. అదే విధంగా మీకు ఇప్పటికే ఏదైనా సమస్య ఉన్నట్టైతే.. మీరు డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతే బొప్పాయిని తినాలి.