హైపో థైరాయిడిజం సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి..

First Published Aug 23, 2022, 4:55 PM IST

శారీరక శ్రమ లేకపోవడం, చెడు ఆహారపు అలవాట్లు ఉండటం, జీవన శైలి సరిగ్గా లేకపోవడం వంటి కారణాల వల్ల థైరాయిడ్ సమస్య బారిన పడతారు.
 

hypothyroidism

మన శరీరంలో థైరాయిడ్ ముఖ్యమైన భాగం. ఇది హార్మోన్లను ఉత్పత్తి చేసే ఒక రకమైన ఎండోక్రైన్ గ్రంధి. ఈ థైరాయిడ్ హార్మోన్లపై మన శరీరంలోని ప్రతి కణం, గ్రంధి దాని జీవక్రియను నియంత్రించడానికి ఆధారపడతాయి. ఇది కేలరీలను కరిగించడానికి కూడా సహాయపడతుంది. అయినా ఈ రోజుల్లో థైరాయిడ్ సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా హైపో, హైపర్ థైరాయిడిజం బారిన పడుతున్నారు. 

hypothyroidism

థైరాయిడ్ రెండు రకాలు.. 

థైరాయిడ్ హైపర్ థైరాయిడిజం అని, హైపో థైరాయిడిజం అని రెండు రకాలుగా ఉంటుంది. మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల వల్ల ఈ సమస్య బాగా పెరిగిపోతోంది.  తగినంత థైరాయిడ్ హార్మోన్లు ఉత్పత్తి కాని పరిస్థితినే  హైపో-థైరాయిడిజం అంటారు.

ఈ సమస్య ఉన్నవారికి తరుచుగా జలుబు చేస్తుంది. అలాగే ఎప్పుడూ చూసినా అలసిపోయినట్టుగానే ఉంటారు. మలబద్దకం సమస్య కూడా ఉంటుంది. దీనికి తోడు ఈ సమస్య ఉన్నవారు విపరీతంగా బరువు పెరిగిపోతారు. సరైన చికిత్స, శారీరక శ్రమ, మంచి ఆహారం  తీసుకుంటే ఈ సమస్యను అదుపులో పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు కూడా హైపో-థైరాయిడిజం సమస్యతో బాధపడుతున్నట్టైతే ఈ ఆహారాలను ఎప్పుడూ తినకండి. 

షుగర్ ఫుడ్స్

చక్కెర మన ఆరోగ్యానికి మంచి కంటే చెడే ఎక్కువ చేస్తుంది. దీన్ని మోతాదులో తీసుకుంటే ఎలాంటి  సమస్య లేదు. ఎక్కువగా తీసుకుంటేనే ఎక్కడలేని సమస్యలన్నీ చుట్టుకుంటాయి. దీనిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. పోషకాలను మాత్రం ఉండవు. మీకు చక్కెర ఎక్కువగా ఉండే స్వీట్లు, చాక్లెట్లు ఇష్టముంటే వెంటనే ఆ అలవాట్లను మానుకోండి. ఎందుకంటే హైపో-థైరాయిడిజం కారణంగా జీవక్రియ మందగిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో మీరు షుగర్ ను ఎక్కువగా తీసుకుంటే విపరీతంగా బరువు పెరుగుతారు.
 

ప్రాసెస్ చేసిన ఆహారాలు

 హైపో-థైరాయిడిజం సమస్యతో బాధపడేవారు ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటిలో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.
 

గ్లూటెన్ అధికంగా ఉండే ఆహారాలు

హైపో-థైరాయిడిజం సమస్యను ఫేస్ చేస్తున్నవారు  గ్లూటెన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం మానేయాలి. గోధుమ, బార్లీ, రాగులు వంటి తృణధాన్యాలలో కనిపించే గ్లూటెన్ అనే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల థైరాయిడ్ సమస్య ఎక్కువ అవుతుంది.
 

కెఫిన్

మనందరికీ తెలుసు.. అధిక మొత్తంలో కెఫిన్ తీసుకోవడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని. అయితే  కెఫిన్ మోతాదుకు మించి తీసుకుంటే కూడా హైపోథైరాయిడిజం ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఈ కెఫిన్ ను ఎక్కువగా తీసుకోకండి. 

సోయా ఉత్పత్తులు

సోయా ఆరోగ్యానికి మేలు చేసేదే అయినా దీనిలో ఉండే ఐసోఫ్లేవోన్ అనే సమ్మేళనం హైపో థైరాయిడ్ సమస్యను పెంచుతుందని పలు పరిశోధనలు తెలుపుతున్నాయి. అందుకే హైపో-థైరాయిడిజం సమస్య ఉన్న వారు టోఫు, సోయా పాలు, సోయాబీన్స్ వంటి వాటిని తినకూకడదు. 
 

click me!