ఈ సూపర్ ఫుడ్స్ ఆడవారి అందాన్ని అలా అలా పెంచేస్తాయి.. ! ఆరోగ్యంగా కూడా ఉంచుతాయి..

Published : Aug 23, 2022, 04:16 PM IST

కొన్ని రకాల పచ్చికూరగాయలు, పాలు, పండ్లు, పెరుగు, టొమాటోలు, గుడ్లను తింటే ఆడవారు అందంగా కనిపించడమే కాదు.. వయసు పెరుగుతున్నా.. యవ్వనంగానే కనిస్తారు.   

PREV
17
 ఈ సూపర్ ఫుడ్స్ ఆడవారి అందాన్ని అలా అలా పెంచేస్తాయి.. ! ఆరోగ్యంగా కూడా ఉంచుతాయి..

సాధారణంగా ఆడవారికి వారి ఆరోగ్యం గురించి కొంచెం కూడా చింత ఉండదు. హెల్త్ బాలేకున్నా.. ఇంట్లోవాళ్లందరి ఆరోగ్యం గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ వారి గురించి మాత్రం పట్టించుకోరు. దీనివల్లే ఎంతో మంది ఆడవారు ఒక వయసు వచ్చిన తర్వాత పూర్తిగా అనారోగ్యం బారిన పడుతున్నారు. నిజానికి పురుషుల కంటే ఆడవారికే పోషకాహారం ఎక్కువగా అవసరం. ఎందుకంటే వీరు ప్రతి నెలా నెలసరి సమస్యను ఫేస్ చేయడంతో పాటుగా పిల్లలకు జన్మనిస్తారు. వీటిమూలంగా వీరి శరీరంలో ఎన్నో మార్పులొస్తాయి. అందుకే వీరు హెల్తీ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవాలి. కొన్ని రకాల ఆహారాలను రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆడవారు అందంగానే కాదు ఆరోగ్యంగా కూడా ఉంటారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

27

పాలు

పాలలో ప్రోటీన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అందుకే ఆడవారు ఫ్యాట్ కంటెంట్ తక్కువగా ఉండే పాలను రోజూ తాగాలి. అయితే ఈ పాలతో పాటుగా ఆరెంజ్ జ్యూస్ ను తాగినా.. ఆరోగ్యం బాగుంటుంది.వీటిలో ఎముకలను బలంగా ఉంచే కాల్షియం, విటమిన్ డి, విటమిన్ సి లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. 
 

37

పెరుగు

కొవ్వు తక్కువగా ఉండే కొవ్వు ఆడవారికి ఎంతో మేలు చేస్తుంది. ఈ రకమైన పెరుగును తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. కడుపు సమస్యలతో బాధపడేవారికి పెరుగు మెడిసిన్ లా పనిచేస్తుంది. పెరుగు యోని ఇన్ఫెక్షన్ ను, అల్సర్ ను కూడా తగ్గిస్తుంది.

47

టమాటాలు

ఆడవారికి టమాటాలు ఔషదంతో సమానం. ఎందుకంటే దీనిలో పుష్కలంగా ఉండే లైకోపీన్ రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని చాలా అధ్యయనాలు నిరూపించాయి. ఇక టొమాటాల్లో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులను తగ్గించడానికి సహాయపడతాయి. టామాటాలు అందాన్ని పెంచడానికి కూడా సహాయపడతాయి. వీటిని రోజూ తినడం వల్ల ఎంత వయసు వచ్చినా యవ్వనంగానే కనిపిస్తారు. ఎందుకంటే ఇది చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. 

57

సోయాబీన్స్

సోయాబీన్స్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆడవారి శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. వీటిలో విటమిన్స్, ఐరన్ వంటి పోషకాలకు ఏ కొదవా ఉండదు. ఇవి ఆడవారిని అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 

 

67

డ్రై ఫ్రూట్స్

డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిని తినడం వల్ల మన శరీరానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. అందుకే వీటిని ఆడవారు తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో విటమిన్ బి12, విటమిన్ ఇ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ డ్రై ఫ్రూట్స్ ను రోజూ గుప్పెడు తింటే ఆడవారు బలంగా ఉంటారు. 
 

77

బెర్రీలు

బ్లూబెర్రీలు, బ్లాక్ బెర్రీలు, రాస్ బెర్రీలు, స్ట్రాబెర్రీలు, క్రాన్ బెర్రీలను రోజూ తింటే మీరు ఎలాంటి రోగాల బారిన పడే అవకాశమే రాదంటారు నిపుణులు. ఎందుకంటే వీటిలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ముఖ్యంగా వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల ఆడవారికి పెద్దపేగు క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. ఎందుకంటే వీటిలో క్యాన్సర్ తో పోరాడే ఔషదగుణాలుంటాయి. 

Read more Photos on
click me!

Recommended Stories