ఉదయం ఇలాంటి బ్రేక్ ఫాస్ట్ లు చేస్తే.. మీ ఆరోగ్యానికి ఏ డోకా ఉండదు..

Published : Aug 23, 2022, 03:27 PM ISTUpdated : Aug 23, 2022, 03:28 PM IST

ఉదయం మనం తినే ఆహారాల్లో పోషకాలు ఎక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. ఇవే మనల్ని రోజంతా ఎనర్జిటిక్ గా ఉంచడానికి సహాయపడతాయి. 

PREV
16
ఉదయం ఇలాంటి బ్రేక్ ఫాస్ట్ లు చేస్తే.. మీ ఆరోగ్యానికి ఏ డోకా ఉండదు..

మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. మరి ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ లో. మార్నింగ్ మనం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ ఎంత హెల్తీది అయితే మన ఆరోగ్యం అంత బాగుంటుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో కొన్ని ఆహారాలను తింటే శక్తివంతంగా తయారవుతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

26

ఉడికించిన గుడ్లు

ఉడికించిన గుడ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇదయం ఒక ఉడకబెట్టిన గుడ్డును, కొత్తిమీర జ్యూస్ లేదా పుదీనా జ్యూస్ లను కూడా తాగాలి. అలాగే టోస్ట్ లను తీసుకుంటే కూడా మీరెంతో హెల్తీగా ఉంటారు. అలాగే శరీరంలో పోషకాల లోపం కూడా పోతుంది. 
 

 

36

దోశ

దోశ అంటే లొట్టలేసుకుంటూ తినేవాళ్లు చాలా మందే ఉన్నారు. నిజానికి దోశలో కూడా ఎన్నో రకాల పోషకాలుంటాయి. అయితే ఈ దోశను పచ్చ పెసర్లతో చేసుకుని తింటే మరీ మంచిది. ఇక వీటిని క్యారెట్ లేదా టమాటా రసం, గ్రీన్ చట్నీతో తింటే మీరు పదికాలాల పాటు ఆరోగ్యంగా జీవిస్తారు. 

46

గోబీ పరాటా

గోబీ పరాటా కూడా మన ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచడంతో పాటుగా బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. బోబీ పరాటాను పెరుగుతో తింటే మంచి ఫలితాలొస్తాయి. 

56

బాదం పప్పులు

ఉదయం పూట ఎక్కువ మొత్తంలో తినని వారు కొన్ని బాదంపప్పులను తిన్నా సరిపోతుంది. వీటితో పాటుగా గ్లాస్ టొమాటో జ్యూస్ ను, ఉడకబెట్టిన గుడ్లను తిన్నా మీ శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. 
 

66

పండ్లు

పండ్లు మన ఆరోగ్యానికి చాలా అవసరం. ఎందుకంటే వీటి ద్వారా మన శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. అందుకే వీటిని మీ బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకోండి. ప్రతిరోజూ ఒక కప్పు ఫ్రెష్ పండ్లను తింటే మీ శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు లభిస్తాయి.  

Read more Photos on
click me!

Recommended Stories