వాతావరణంలో మార్పుల వల్ల దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తుంటాయి. జలుబు తొందరగా తగ్గినా..దగ్గు మాత్రం నెల రోజులైనా తగ్గదు. దీనివల్ల గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. ఏదీ సరిగ్గా తినడానికి, తాగడానికి కూడా రాదు. ఇది కఫ సమస్యలకు దారితీస్తుంది. సాధారణంగా దగ్గు వారంలోపే తగ్గిపోతుంది. ఒకవేళ మీకు ఇలా తగ్గకుండా వారాలకు వారాలు అలాగే ఉంటే మాత్రం మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. కరోనిక్ కఫానికి గురైతే కూడా ఇలాగే అవుతుంది. ఈ దీనివల్ల నెలకంటే ఎక్కువ రోజులు దగ్గు ఉంటుంది.
దగ్గుకు ప్రధాన కారణం ఇన్ఫెక్షన్. దీన్ని తగ్గించుకోవడానికి ట్యాబ్లెట్లను వాడుతుంటారు. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటే దగ్గు వారం లోపు దానంతట అదే తగ్గిపోతుంది. ముఖ్యంగా తినడం, తాగడంలో జాగ్రత్తగా ఉండాలి. గొంతులో కఫం పెరిగితే కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి అవేంటంటే..
పెరుగు
పెరుగు మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. గట్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా గ్యాస్ట్రిక్, మలబద్దకం, అజీర్థి వంటి సమస్యలు తలెత్తే అవకాశమే ఉండదు. కానీ దగ్గు ఉన్నప్పుడు పెరుగును తినకూడదు. ఒకవేళ తింటే కఫం పెరుగుతుంది. ఎందుకంటే పెరుగు చలువ చేస్తుంది కాబట్టి.
ఐస్ క్రీం
ఐస్ క్రీం ను తినని వారు అసలు ఉండరేమో. కొంతమంది జబులు చేసినా, దగ్గు తగిలినా అలాగే ఐస్ క్రీం ను తింటుంటారు. కానీ ఇలాంటి సమయంలో ఐస్ క్రీం ను తినడం వల్ల దగ్గు తొందరగా తగ్గదు. అందుకే దగ్గు ఉన్నప్పుడు ఐస్ క్రీం ను తినకపోవడమే మంచిది.
శీతల పానీయాలు
పట్టణాల నుంచి పల్లెల వరకు వీటికి జనాలు బాగా అలవాటు పడిపోయారు. దాహం వేస్తే చాలు నీళ్లకు బదులుగా వీటినే తాగుతుంటారు. కానీ దగ్గు ఉన్నప్పుడు వీటిని అసలే తాగకూడదు. వీటిని తాగడం వల్ల దగ్గు మరింత ఎక్కువ అవడమే కాదు ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.
డీప్ ఫ్రైట్ ఫుడ్స్
డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ను తింటే దగ్గు మరింత పెరిగిపోతుంది. కొవ్వు, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాల నుంచి కొవ్వు ఆమ్లాలు శరీరం నుచి శ్లేష్మాన్ని ఎక్కువ ఉత్పత్తి చేసేలా ప్రేరేపిస్తాయి. అందుకే ఇలాంటి ఆహారాలను దగ్గు ఉన్నప్పుడు తినండి. ఇవి మీ రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి.