మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి..

First Published Oct 7, 2022, 4:54 PM IST

మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. ఈ వ్యాయామంతోనే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండె  ఆరోగ్యం కూడా బాగుంటుంది. 
 

Kidney disease

మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి. అయితే మూత్రపిండాలకు సంబంధించిన ఏ సమస్యలు వచ్చినా.. దాని లక్షణాలు అంత తొందరగా కనిపించవు. కానీ మూత్రపిండాల వ్యాధిని ముందుగా గుర్తిస్తే మన లైఫ్ స్టైల్ లో ఛేంజెస్ ద్వారా నియంత్రించవచ్చు. మూత్రపిండాలు వ్యర్థాలను ఫిల్టర్ చేయడం, వాటిని బయటకు పంపడం వంటి పనులను చేస్తుంది. అందుకే మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటేనే మన మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

exercise

ప్రతిరోజూ వ్యాయామం చేయాలి

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల బాడీ ఫిట్ గా ఉంటుంది. అంతేకాదు అధిక రక్తపోటు కూడా తగ్గుతుంది. అలాగే మీ గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే ప్రతిరోజూ ఒక అర్థగంట అయినా ఫాస్ట్ నడక, రన్నింగ్, సైక్లింగ్, డ్యాన్స్ వంటివి చేయండి. ఈ  చిన్న చిన్న వ్యాయామాలు మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. 

బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా చూసుకోవాలి

రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది. శరీరంలోని కణాలు రక్తంలో గ్లూకోజ్ ను ఉపయోగించలేనప్పుడు మూత్రపిండాలు రక్తాన్ని ఫిల్టర్ చేయడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఇది మూత్రపిండాల పనితీరును దెబ్బతీస్తుంది. 
 

ఊబకాయం

ఊబకాయం కూడా మూత్రపిండాలను దెబ్బతీసే ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందుకే ఊబకాయానికి దారితీసే ఆహారాలను తినకండి.  సోడియం తక్కువగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారాలు అంటే కాలీఫ్లవర్, బ్లూబెర్రీస్, చేపలు, తృణధాన్యాలను మీ ఆహారంలో చేర్చండి.
 

నీటిని పుష్కలంగా తాగండి

మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే నీటిని పుష్కలంగా తాగాలి. రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీటినైనా తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక కిడ్నీల్లో రాళ్లతో బాధపడేవారు మళ్లీ రాళ్లు ఏర్పడకూడదంటే నీటిని ఎక్కువగా తాగాలి. 
 

దూమపానం

స్మోకింగ్ ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. అంతేకాదు ఇది శరీరంలోని రక్త నాళాలను కూడా దెబ్బతీస్తుంది. స్మోకింగ్ చేయడం వల్ల మీ శరీరంలో, మూత్రపిండాలలో రక్త ప్రవాహం నెమ్మదిగా వెళుతుంది. ధూమపానం మూత్రపిండాల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.

click me!