పరిగడుపున పచ్చి వెల్లుల్లిని తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో..!

First Published Oct 7, 2022, 3:45 PM IST

వెల్లుల్లి ఎన్నో ప్రమాదకరమైన రోగాలను కూడా నయం చేస్తుంది. అందుకే దీన్ని దివ్య ఔషదంగా భావిస్తారు. అయితే దీన్ని పరిగడుపున తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. 
 

garlic

భారతదేశంలో ప్రతి వంటగదిలో ఖచ్చితంగా వెల్లుల్లి ఉంటుంది. దీన్ని ప్రతి ఒక్క కూరలో వేస్తారు. వెల్లుల్లిలో వేడి చేసే గుణం ఉంటుది. అలాగే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి. వెల్లుల్లి మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఎన్నో రకాల ప్రమాదకరమైన రోగాలను, ఇతర అంటువ్యాధుల ప్రమాదాన్ని కూడా నివారిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వెల్లుల్లిని ఉదయం పరిగడుపున తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

క్యాన్సర్ ముప్పు తప్పుతుంది

వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు ఉంటాయి. వీటిని ఉదయం ఏవీ తినకుండా పరిగడుపున తింటే క్యాన్సర్ ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. 
 

బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి

వెల్లుల్లి మధుమేహులకు మెడిసిన్స్ తో సమానం. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. అందుకే మధుమేహులు ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో 4 వెల్లుల్లి రెబ్బలను తినండి.

బరువు తగ్గుతారు

వెల్లుల్లి ఆరోగ్యంగా మీరు బరువు తగ్గేందుకు కూడా సహాయపడుతుంది. ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచి పరిగడుపున కొన్ని వెల్లుల్లి రెబ్బలను తింటే చాలా ఫాస్ట్ గా బరువు తగ్గుతారు. దీనిలో మీ శరీరంలో అదనపు కొవ్వును కరిగించడానికి సహాయపడే కొన్ని సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. 
 

మానసిక ఆరోగ్యం బాగుంటుంది

వెల్లుల్లి మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. రోజూ పరిగడుపున కొన్ని వెల్లుల్లి రెబ్బలను తినడం వల్ల మెదడు ఆరోగ్యం బాగుంటుంది. ఇది నిరాశను పోగొడుతుంది. శరీరానికి శక్తిని అందిస్తుంది. అలాగే ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.  ఇన్ని ప్రయోజనాలున్నాయని వెల్లుల్లి రెబ్బలను మోతాదుకు మించి తింటే మాత్రం ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.
 

click me!